More

    పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మృతి..!

    పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, ఆ దేశ మిలటరీ మాజీ అధినేత పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. దుబాయ్ లో ఆదివారం తుదిశ్వాస విడిచారని పాక్ మీడియా ఆదివారం తెలిపింది. ముషారఫ్ చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొంతకాలంగా దుబాయ్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముషారఫ్ వయసు 79 ఏళ్లు. ముషారఫ్ 1943 ఆగస్టు 11న జన్మించారు. కరాచీలోని సెయింట్ ప్యాట్రిక్స్ లో ప్రాధమిక విద్యాభ్యాసం చేశారు. ఆర్మీలోకి వచ్చిన ఆయన 1998లో జనరల్ ర్యాంక్ సాధించారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. 1999లో పాక్ ప్రభుత్వాన్ని మిలటరీ అధీనంలోకి తీసుకోగా పర్వేజ్ దేశాధ్యక్షుడయ్యారు. 2001 నుంచి 2008 వరకు పాక్ అధ్యక్షుడిగా పని చేశారు.

    ముషారఫ్ మృతదేహాన్ని తిరిగి పాకిస్తాన్‌కు తీసుకువస్తారో లేదో అధికారిక సమాచారం లేదు, అయితే అతని కుటుంబ సభ్యులు అతన్ని స్వదేశానికి తీసుకురావడానికి గత సంవత్సరం నుండి ప్రయత్నిస్తున్నారు. ముషారఫ్ అవయవాలు అమిలోయిడోసిస్ అనే వ్యాధి కారణంగా పనిచేయడం లేదు. 2007లో మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్యకు సంబంధించి ఆరోపణలను ఎదుర్కొంటున్న ముషారఫ్ గత ఎనిమిదేళ్లుగా దుబాయ్‌లో నివసిస్తున్నారు. అతను ఇంతకు ముందు తన చివరి క్షణాలు భారతదేశంలో గడపాలని తన కోరికను వ్యక్తం చేశాడు. వీలైనంత త్వరగా పాకిస్తాన్‌కు తిరిగి రావాలని కోరుకున్నాడు. కానీ కేసులకు, కోర్టు శిక్షలకు భయపడి ముషారఫ్ పాక్ కు తిరిగిరాలేకపోయాడు.

    Trending Stories

    Related Stories