హాలో ఫ్రెండ్స్ !
రెండు రోజుల క్రితం పాకిస్తాన్ కాయద్ ఏ ఆజంగా పిలువబడే మహమ్మద్ అలీ జిన్నా విగ్రహాన్ని బాంబులు పెట్టి ధ్వంసం చేసిన వార్త ఒకటి వచ్చింది. బెలూచిస్తాన్ గ్వదర్ లోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో మహమ్మద్ అలీ జిన్నా విగ్రహాన్ని పాక్ పాలకులు ఏర్పాటు చేశారు. అయితే రెండు రోజుల క్రితం బలూచ్ రిపబ్లికన్ ఆర్మీ కార్యకర్తలు కొందరు పేలుడు పదార్థాలతో జిన్నా విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు సమాచారం.!
అలాగే ఈ ఏడాది ఆగస్టు 17వ తేదీన లాహోర్ లోని మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని సైతం ఓ ఇస్లామిక్ మతోన్మాది ధ్వంసం చేయడం జరిగింది. ఇస్లామిక్ దేశంలో విగ్రహాలను ఏర్పాటు చేయడం.. ఇస్లామిక్ మత సూత్రాలకు విరుద్ధమని.. అందుకే మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు పాకిస్తాన్ కు చెందిన తెహరిక్ ఏ తాలిబన్ పార్టీకి చెందిన నాయకులు ఆ తర్వాత ప్రకటించారు.
మరి అలాగైతే…! బెలూచిస్తాన్ గ్వదర్ లో మహమ్మద్ అలీ జిన్నా విగ్రహాన్ని.., ఏ ఇస్లామిక్ సూత్రాల ప్రకారం, పాక్ పాలకులు ఏర్పాటు చేశారో? చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక ఈ విషయంలోనే పాకిస్తానీలకు అనేక విషయాల్లో ఎప్పుడు కన్ఫ్యూజనే.!
నిజానికి పాకిస్తాన్… అనేది మతం ఆధారంగా ఏర్పడిన దేశం.! హిందూ వ్యతిరేకత నుంచే అది పుట్టిందన్నది నిప్పులాంటి నిజం.! హిందువులు , ముస్లింలు కలిసి జీవించలేరు ! కనుకనే పాకిస్తాన్ అనే దేశం కావాలంటూ.., ద్విజాతి సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చింది ముస్లింలీగ్.! మతకల్లోలు సృష్టించింది.! హిందువుల ఊచకోతలతో రక్తాన్ని పారించింది.! 1947లో భారత్ ను ముక్కలు చేసి మరి పాకిస్తాన్ ఏర్పాటు అయ్యింది. ! కొత్త దేశంగా అవతరించిన పాకిస్తాన్.. తమది ఇస్లామిక్ స్టేట్ అని ఎంతో గర్వంగా చెప్పుకుంది. చెప్పుకోవడం వరకు బాగానే ఉన్నా.. పాకిస్తాన్ పాలకులకు అసలు కన్ఫ్యూజన్ అక్కడి నుంచే మొదలైంది.
ముస్లిం దేశంగా అవతరించిన పాకిస్తాన్.., తన గత చరిత్రను గుర్చి తమ విద్యార్థులకు ఏమని బోధించాలి.? పాకిస్తాన్ లోని పంజాబ్, సింధ్, బెలూచిస్తాన్, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ఫావిన్స్ ప్రాంతాల్లో .., 1947కు ముందు ఆయా ప్రాంతాలలో నివసించిన ప్రజల ఐడెంటి, సాంస్కృతిక వారసత్వానికి.., పాక్ పాలకులు ఇచ్చే నిర్వచనం ఏంటీ ? అసలు పాక్ పాలకులకు తాము ఎవరమనే దానిపైనా క్లారిటీగా ఉన్నారా?
అయితే పాకిస్తాన్ లోని ఆయా ప్రావీన్స్ లో నివసించే ప్రజల పూర్వీకులు ఒకప్పుడు హిందువులేనన్నది కఠోర వాస్తవం.! ఇస్లామిక్ దురాక్రమణల తర్వాత వారందరూ బలవంతంగా మతం మర్చబడ్డారనే విషయాన్ని, సగటు పాకిస్తాన్ లకు.., పాక్ పాలకులు ఎందుకు బోధించడం లేదు.?
పాకిస్తాన్ లోని కొంతమంది చరిత్రకారులు తమ దేశానికి సంబంధించిన ఘనమైన చరిత్రను డాక్యుమెంటరీ రూపంలో చిత్రకరించేందుకు కూర్చొన్నారట.! అయితే తమ దేశ చరిత్రను ఎప్పటి నుంచి మొదలు పెట్టాలన్న ప్రశ్న దగ్గరే, వారు రోజుల తరబడి చర్చించుకున్నారు.! కారణం… పాకిస్తాన్ అనే దేశం పుట్టి కేవలం 75 ఏళ్ళు మాత్రమే అయ్యింది.!
పాకిస్తాన్ ఏర్పాటుకు పూర్వం ఉన్నదంతా కూడా అఖండ భారత దేశ చరిత్రేకదా? వేలాది సంవత్సరాల భారత దేశం చరిత్రలో.., ఇప్పుడున్న పాక్ ప్రజలు, వారి పూర్వీకులు అంతర్భాగం కాదా అంటూ మరికొందరు ప్రశ్నించారట.! దాంతో మరికొందరు…, అలా ఎలా అవుతుందని… , అఖండ భారతంలో ., ఇస్లామ్ ప్రవేశించిన సంవత్సరం నుంచే.., మన పాకిస్తాన్ చరిత్రను మొదలు పెట్టాలని వాదించారట.! కామన్ఏరా 712లో.., భారత అంతర్భాగమైన సింధు రాజ్యంపై దాడి చేసిన మొదటి ఇస్లామిక్ దురాక్రమణదారుడైన మీర్ కాసిమ్ వారసులమని వాదించారట.!
దీంతో మరికొందరు కాదు కాదు అన్నారట…! భారత దేశంలో మొదటగా ముస్లిం వేర్పాటువాద బీజాలు నాటిన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కు మనం వారసులమని.., అప్పటి నుంచే పాకిస్తాన్ చరిత్రను మొదలు పెట్టాలని వాదించారట.! ఇంకా మరికొందరు అయితే…, జిన్నా ముస్లింలీగ్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ,పాకిస్తాన్ చరిత్రను మొదలు పెట్టాలంటే…, కాదు 1940 లో ముస్లింలీగ్ చేసిన లాహోర్ డిక్లరేషన్ నుంచి మొదలు పెట్టాలని డిమాండ్ చేశారట.! అటు పాకిస్తాన్ కు చెందిన అరిఫ్ అజాకియా, తారిఖ్ ఫతే వంటి చరిత్రకారులు మాత్రం తాము అఖండ భారత వారసత్వానికి వారసులమని గర్వంగా చెప్పుకుంటున్నారు.
అందుకే మీరు పాకిస్తాన్ చరిత్రను తెలుసుకునేందుకు యూట్యుబ్ సెర్చ్ చేయండి.! పాకిస్తానీలకు తమ హిస్టరిని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో…, వారిలోనే ఏకాభిప్రాయం లేదన్నది స్పష్టం అవుతుంది. ! అంతేకాదు ఎవరు అసలైన పాకిస్తానీయులు… అనే అంశంపై కూడా ఏకాభిప్రాయం లేదనే వాదనలు కూడా మనకు వినిపిస్తుంటాయి.!
పాకిస్తాన్ కావాలంటూ పోరాటం చేసిన వారు.., మా ముస్లిం దేశం.., పాకిస్తాన్ కు వెళ్తున్నామంటూ, 1947లో అక్కడికి వెళ్లినవాళ్లను., మొహజీర్లు అంటూ పాక్ పాలకులు పక్కన పెట్టారు. వారిని తమ దేశ పౌరులుగా గుర్తించడం లేదని.., కనీస మానవ హక్కులు కూడా లేకుండా పోయాయని ఇప్పటికీ మొహజీర్లు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.!
సరే..భారత్ నుంచి పాకిస్తాన్ వెళ్లిన మొహజీర్లు ముస్లింలే కాదనుకుంటే…, మరి బెలూచిస్తాన్ ప్రజలు, అలాగే ఫస్తూన్లు , ఇటు సింధీలు, హజర్వాలెవరు? వారిది కూడా పాకిస్తాన్ లో మొహజీర్లలాగా సేమ్ టు సేమ్ పరిస్థితే.!
వీరందరూ మతపరంగా ముస్లింలే అయినా కూడా.., ముస్లిం దేశమైన పాకిస్తాన్ లో వివక్షకు గురవుతూనే ఉన్నారన్నది నిజం.! వీరందరూ కూడా కనీస సౌకర్యాలు, హక్కులకు నోచుకోకుండా వీరందరూ దుర్భర జీవితాలను గడుపుతున్నారు.
మరి… పాకిస్తాన్ లో అసలైన పాకిస్తానీ ముస్లింలు ఎవరు? కేవలం పంజాబ్ ప్రావిన్స్ లోని ఉర్దు మాట్లాడే పంజాబీ ముస్లింలేనా?
బెలూచిస్తాన్ తోపాటు, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ఫావ్రిన్స్ ప్రజలు… నిజానికి తాము భారత దేశంలోనే కలుస్తామని 1947 లోనే బహిరంగంగానే ప్రకటించారు. అయితే జిన్నా, ముస్లింలీగ్ సభ్యులు… సైన్యాన్ని ఉపయోగించి.., అక్కడి పాలకులను మభ్యపెట్టి , కాదంటే భయపెట్టి పాకిస్తాన్ లో విలీనం అవుతున్నట్లుగా బలవంతంగా సంతకాలు చేయించుకున్నారనే విషయాన్ని ఎవరు మర్చిపోరాదు.! పాకిస్తాన్ ఏర్పాటు తర్వాత జిన్నా బతికింది కేవలం 13 నెలలు మాత్రమే.! పాకిస్తాన్ పాలకుడిగా ఉంటూనే.. దిక్కులేని వాడిలా నడిరోడ్డుపైనా ఓ అంబులెన్స్ లో ప్రాణం వదిలాడు జిన్నా.!
ఇవన్నీ పరిశీలించిన తర్వాత… పాకిస్తానీలకు తమ అసలైన అస్థిత్వమేదో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నారనిస్తోంది.!