More

    ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెబుతున్న పాకిస్థాన్ బాలిక

    కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం సహకారంతో ఉక్రెయిన్ లోని కీవ్ నుంచి బయటపడిన పాకిస్థాన్ బాలిక భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి థ్యాంక్స్ చెబుతూ పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది. కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం సహాయంతో ఉక్రెయిన్‌లోని యుద్ధ ప్రాంతం నుండి అస్మా షఫీక్ అనే పాకిస్థానీ అమ్మాయిని ఖాళీ చేయించారు. వైరల్ అవుతున్న వీడియోలో చాలా క్లిష్ట పరిస్థితి నుండి తప్పించుకోవడానికి సహాయం చేసినందుకు భారత రాయబార కార్యాలయానికి, ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపింది. ఆమె మాట్లాడుతూ, “మేము చాలా క్లిష్ట పరిస్థితిలో చిక్కుకున్నాం. ఇక్కడ మాకు అన్ని విధాలుగా మద్దతు ఇచ్చినందుకు కీవ్‌లోని భారత రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.” అని తెలిపింది. మేం సురక్షితంగా ఇంటికి చేరుకుంటామని ఆశిస్తున్నాం. భారత రాయబార కార్యాలయానికి ధన్యవాదాలు అని ఆ వీడియోలో ఆస్మా పేర్కొంది. ఆస్మా ఇప్పుడు పశ్చిమ ఉక్రెయిన్‌కు వెళ్తోంది. అక్కడి నుంచి ఆమె పాకిస్థాన్ కు చేరుకుంటుంది.

    ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసింది. ఉక్రెయిన్ లోని పలు నగరాలపై రష్యా దాడులు చేస్తూ వస్తోంది. పోరాటం ప్రారంభమైనప్పటి నుండి వందలాది మంది పౌరులు మరణించినట్లు నిర్ధారించబడింది. 1.5 మిలియన్లకు పైగా ప్రజలు ఉక్రెయిన్ నుండి పారిపోయారు. ఫిబ్రవరి 24 న దండయాత్ర ప్రారంభమైనప్పటి నుండి, భారత ప్రభుత్వం ఉక్రెయిన్ నుండి పొరుగు దేశాల ద్వారా ఆపరేషన్ గంగా కింద భారతీయ పౌరులను తరలిస్తోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 16,000 మందికి పైగా పౌరులు భారతదేశానికి తిరిగి వచ్చారు. భారత్ కు చెందిన విద్యార్థులు పలువురు ఇతర దేశాల విద్యార్థులకు సహాయం చేశారు. పలువురు పాకిస్థానీ విద్యార్థులకు భారత విద్యార్థులు అండగా నిలిచారు. టర్కీ, పాకిస్థాన్ దేశాలకు చెందిన విద్యార్థులు కూడా భారత జెండాను తీసుకుని సరిహద్దులు దాటారు.

    Trending Stories

    Related Stories