More

  ఐసీయూలో పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం

  పాకిస్థాన్ బ్యాటింగ్ దిగ్గజం జహీర్ అబ్బాస్ లండన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చేరాడు. జియో న్యూస్ ప్రకారం 74 ఏళ్ల అబ్బాస్.. పాడింగ్‌టన్‌లోని సెయింట్ మేరీస్ హాస్పిటల్‌లో చేరిన మూడు రోజుల తర్వాత ICUకి తరలించబడ్డాడు. ఆయన ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్నట్లు చెబుతున్నారు. అబ్బాస్ దుబాయ్ నుండి లండన్‌కు ప్రయాణిస్తున్నప్పుడు COVID-19 బారిన పడ్డారు. లండన్ కు చేరుకున్న తర్వాత న్యుమోనియాతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఆయనకు డయాలసిస్‌ చేస్తున్నారు. ప్రజలను కలవడం మానుకోవాలని వైద్యులు ఆయనకు సలహా ఇచ్చారని జియో న్యూస్ పేర్కొంది.

  1969లో న్యూజిలాండ్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అబ్బాస్, అతని తరంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. 72 టెస్టుల్లో 5062 పరుగులు, 62 ODIల్లో 2572 పరుగులు చేశాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో, అతను 459 మ్యాచ్‌ల్లో 34,843 పరుగులు చేశాడు, ఇందులో 108 సెంచరీలు. 158 అర్ధసెంచరీలు ఉన్నాయి. రిటైర్మెంట్ తర్వాత అబ్బాస్.. ఒక టెస్టు, మూడు ODIలలో ICC మ్యాచ్ రిఫరీగా కూడా పనిచేశాడు.

  spot_img

  Trending Stories

  Related Stories