భారత్ ను జింబాబ్వే ఓడిస్తే ఆ దేశ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానన్న పాకిస్థాన్ నటి

0
849

ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లు ఎంతో ఆసక్తికరంగా సాగుతూ ఉన్నాయి. భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూపులో ఉన్న సంగతి తెలిసిందే..! భారత్ కు సెమీస్ చేరడానికి అవకాశాలు ఎక్కువగా ఉండగా.. పాకిస్థాన్ కు కాస్త కష్టమే అని అంటున్నారు. ఇక భారత్ సెమీస్ కు చేరాలంటే జింబాబ్వేతో మ్యాచ్ లో గెలిస్తే చాలు. పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే ఆదివారం జరిగే మ్యాచ్ లో జింబాబ్వే చేతిలో టీమిండియా ఓడిపోవాల్సి ఉంటుంది. పాకిస్థాన్ నటి సెహర్ షిన్వారీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. టీమిండియాను జింబాబ్వే ఓడిస్తే, తాను జింబాబ్వే దేశస్తుడ్ని పెళ్లాడతానని ప్రకటించింది. ఆమె పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీమిండియా, బంగ్లాదేశ్ మ్యాచ్ జరిగిన మ్యాచ్ లో భారత్ విజయాన్ని అందుకుంది. దాంతో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలోనే సెహర్ షిన్వారీ పైవిధంగా స్పందించారు. మిగతా మ్యాచ్ లు అన్నింట్లో పాక్ గెలవాల్సి ఉండగా, అదే సమయంలో భారత్ తన చివరి లీగ్ మ్యాచ్ లో జింబాబ్వే చేతిలో ఓడిపోవాల్సి ఉంటుంది. అలా జరిగితే పాక్ కు సెమీస్ బెర్తు లభించే అవకాశం ఉంటుంది.

దక్షిణాఫ్రికాతో తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో పాకిస్థాన్ మిడిలార్డర్ రాణించింది. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి ఓ దశలో 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన పాక్ ను ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ ఆదుకున్నారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 185 పరుగులు చేసింది. ఇఫ్తికార్ అహ్మద్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 51 పరుగులు చేయగా, షాదాబ్ 22 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సులతో 52 పరుగులు చేశాడు. మహ్మద్ నవాజ్ 28, మహ్మద్ హరీస్ 28 పరుగులు చేశారు. సఫారీ బౌలర్లలో ఆన్రిచ్ నోక్యా 4, పార్నెల్ 1, రబాడా 1, ఎంగిడి 1, షంసీ 1 వికెట్ తీశారు.