ఈద్ వేడుకల్లో ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు

0
701

ఈద్ వేడుకల్లో భాగంగా ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేసిన వారిని గురువారం నాడు ఉత్తరప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఇమామ్ కూడా ఉన్నాడు. మొత్తం నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కన్నూజ్ లోని జలాబాద్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో పోలీసులు సదరు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

రిపోర్టుల ఆధారంగా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో కొందరు కలిసి పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం మొదలు పెట్టారు. ఈద్(రంజాన్) సెలెబ్రేషన్స్ లో భాగంగా ఇలా ఇమామ్ తో పాటూ మరి కొందరు యువకులు పాకిస్థాన్ కు జై కొడుతూ నినాదాలు చేశారు. వీడియో వైరల్ అవ్వడమే కాకుండా పోలీసుల వరకూ వెళ్ళింది.

కన్నూజ్ పోలీసులు వీడియో ఆధారంగా విచారణ మొదలు పెట్టారు. ఈ వీడియోను మే 15న తీశారని గుర్తించారు. మొత్తం నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక మసీదులో ఇమామ్ గా విధులు నిర్వర్తిస్తున్న మొహమ్మద్ అఫ్జల్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతడితో పాటూ సల్మాన్, షాహిద్, మీరజ్ అలియాజ్ చోటులను ఉత్తరప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 153-B, 505 (2) కింద కేసులు నమోదు చేశారు. మొత్తం 15 మంది మీద కేసును రిజిస్టర్ చేసినట్లు కన్నూజ్ సిటీ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివ ప్రతాప్ సింగ్ తెలిపారు. ఇంకా 10 మందిని గుర్తించాల్సి ఉందని అన్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here