More

  అమెరికా మీదుగా ఉక్రెయిన్ కు పాక్ ఆయుధాలు.. పశ్చిమ దేశాలకు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్..!

  దాయాది పాకిస్తాన్ కు చిక్కులు తప్పేలా లేవు. సొంత దేశాన్ని కష్టాల నుంచి బయట పడేసే పని పక్కకు పెట్టి ఇతర దేశాలకు ఆయుధాలు సరఫరా చేస్తోంది. ఐతే నమ్మించి మోసం చేయడంలో పాకిస్తాన్ తర్వాత ఏ దేశమైనా అని మరోసారి రుజువు అయింది. ఒకప్పుడు కార్గిల్ లో భారత్ ను నమ్మించి మోసం చేసింది. అదే విధంగా ఎన్నో సార్లు దొంగ దెబ్బ తీసింది. కానీ ప్రపంచ దేశాలకు ఇప్పుడిప్పుడే పాకిస్తాన్ బుద్ధి తెలుస్తుంది. ఒకపక్క రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంటే తాము భారత లాగే విదేశాంగ విధానం పాటిస్తూ తటస్థ వైఖరి ఉంటున్నామని చెబుతూనే దొంగతనంగా అమెరికా వైపు నుంచి పాకిస్తాన్ తమ ఆయుధాలను ఉక్రెయిన్ కు సరఫరా చేస్తోంది.

  ఇలా చేయడం వల్ల బ్రిటన్, అమెరికాతో సంబంధాలను కొనసాగిస్తూ అదే సమయంలో రష్యాకు తెలియకుండా వీటన్నింటినీ సాగిస్తోంది. గత మూడు నెలలుగా ఉక్రెయిన్ కు పాకిస్తాన్ ఆయుధాలను సరఫరా చేస్తుందని ఓ వార్తా సంస్థ బహిర్గతం చేసింది. ఈ విషయంలో పాకిస్తాన్ రహస్యంగా ఆయుధాలను చేరవేయడంపై చర్చ నడుస్తుంది. ఎన్నోసార్లు దొంగ దెబ్బలు తీయడం ఉగ్రవాదులను పెంచి పోషించడం వారికి ఆయుధాలను ఇవ్వడం ద్వారా జమ్మూ కాశ్మీర్లో దాడులను చేయడం ఆ దేశానికి అలవాటైన పని. ఇలాంటి దాడులను భారత్ ఎన్నోసార్లు తిప్పికొట్టింది. కానీ పాక్ తన వక్రబుద్ధిని మరోసారి ప్రపంచం ఎదుట చూపెట్టింది.

  రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు రష్యా కు వెళ్లి వారికి పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతు ఇచ్చారు. ఇప్పుడున్న పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికాకు మద్దతిస్తూ పరోక్షంగా ఉక్రెయిన్ కు సహాయం చేస్తుంది. కానీ రష్యాకు తెలియకుండా చేయాలని చేస్తుంది. ఈ విషయం రష్యాకు తెలిసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి. రష్యా అధ్యక్షుడు పుతిన్ గతంలోనే హెచ్చరించారు. ఉక్రెయిన్ కు ఎలాంటి సహాయ సహకారాలు అందించినా తన నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందని ముందే వివిధ దేశాలకు హెచ్చరించారు. మరి పాక్ చేసిన పనికి రష్యా చర్యలు తీవ్రంగా ఉండే అవకాశాలు లేకపోలేదు.

  అలాగే ఉక్రెయిన్‌కు శక్తివంతమైన ఆయుధాలిచ్చి తమను తాను నాశనం చేసుకోవద్దని పశ్చిమ దేశాలకు రష్యా పార్లమెంట్‌ స్పీకర్‌ వ్యాచెస్లావ్‌ వొలోదిన్‌ హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు మినహా గగన తల రక్షణ వ్యవస్థలు తదితరాలను అందజేస్తామంటూ నాటో, అమెరికా ఇస్తున్న హామీలపై ఆయన స్పందించారు. ఎదురుదాడులకు ఉపయోగపడే ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందజేస్తే, తాము మరింత శక్తివంతమైన ఆయుధాలను వాడాల్సి వస్తుందని, అంతిమంగా ప్రపంచ వినాశనానికే దారి తీస్తుందన్నారు.

  మరోవైపు యుద్ధం మొదలైన కొత్తల్లో ఉక్రెయిన్‌తో సంప్రదింపుల అనంతరం యుద్ధ విరమణకు రష్యా సుముఖత ప్రదర్శించినా అమెరికా, దాని మిత్ర దేశాలు అడ్డుపుల్ల వేశాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ వెల్లడించారు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న లవ్రోవ్‌.. ఫిబ్రవరిలో యుద్ధం మొదలవగా మార్చి నెలాఖరుకు ఆపేయడానికి తమ రెండు దేశాలు సూత్రప్రాయంగా అంగీకరించాయని చెప్పారు. తరవాత అమెరికా, దాని మిత్రదేశాలు అడ్డుపడ్డాయనీ, ఉక్రెయిన్‌ నుంచి మళ్లీ అటువంటి ప్రతిపాదన రాలేదని లవ్రోవ్‌ వివరించారు.

  ఇక రష్యా, ఎస్తోనియా దేశాలు మధ్య కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరి రాయబారిని మరొకరు బహిష్కరించుకున్నాయి. వారి స్థానంలో దౌత్యాధికారులను నియమిస్తామని ప్రకటించాయి. ఎస్తోనియా రాయబారి ఫిబ్రవరి 7లోపు తమ దేశం విడిచి వెళ్లాలని రష్యా సూచించగా.. దానికి ప్రతిస్పందనగా రష్యా రాయబారి కూడా ఆ తేదీకల్లా తమ దేశం వీడాలని ఎస్తోనియా ప్రకటించింది. తమ దేశంలో ఉన్న రాయబార కార్యాలయంలో సిబ్బందిని తగ్గించాలని రష్యాకు ఎస్తోనియా సూచించడంతో ఈ వివాదం మొదలయింది. ఉక్రెయిన్‌పై రష్యా చర్యలను వ్యతిరేకించే దేశాల్లో ఎస్తోనియా ఒకటి. మరోవైపు రష్యా ప్రైవేట్‌ సైన్యంగా ప్రచారంలో ఉన్న వాగ్నర్‌ గ్రూప్‌నకు చెందిన మాజీ అధికారి ఒకరు నార్వేలోకి అక్రమంగా ప్రవేశించాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడిని ఆండ్రీ మెద్వదేవ్‌గా గుర్తించారు. తనకు ఆశ్రయం ఇచ్చి రక్షణ కల్పిస్తే వాగ్నర్‌ గ్రూప్‌ అకృత్యాలను బయటపెడతానని అతడు చెప్పిన వీడియో బయటకొచ్చింది.

  Trending Stories

  Related Stories