బ్లాక్ లిస్ట్‎లో నుంచి బయటపడనున్న పాక్..!

0
827

ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ పాకిస్తాన్‌ని గ్రే లిస్ట్‌ లో ఉంచింది. ఐతే ఇప్పుడు తాజాగా పాక్‌ త్వరలోనే ఆ గ్రే లిస్ట్‌ నుంచి బయటపడునుందని పాక్‌ విదేశాంగ వ్యవహారాల మంత్రి హీనా రబ్బానీ ఖార్‌ చెబుతున్నారు.

అంతేకాదు ఆ బ్లాక్‌లిస్ట్‌ నుంచి బయటపడేందకు పాక్‌ కేవలం ఒక అడుగు దూరంలోనే ఉన్నట్లు తెలిపారు. 2018 నుంచి ఎఫ్‌ఏటీఎఫ్‌ పాక్‌ని బ్లాక్‌లిస్ట్‌లో ఉంచింది. అప్పటి నుంచి ఇస్లామాబాద్‌ బయటపడేందకు పలు రకాలుగా కృషి చేసింది. ఈ మేరకు ఎఫ్‌ఏటీఎఫ్‌ తీవ్రవాదం, మనీలాండరింగ్‌కు సంబంధించిన ఫైనాన్సింగ్‌ విషయాల్లో సాధించిన పురోగతిని ధృవీకరించింది. అంతేకాదు గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్‌ను రక్షించడానికి జీ7 దేశాలు ఏర్పాటు చేసిన ఫైనాన్షియల్ క్రైమ్ వాచ్‌డాగ్ పాక్‌ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మొత్తం 34 అంశాలను కవర్‌ చేస్తూ.. రెండు కార్యాచరణ ప్రణాళికలను గణనీయంగా పూర్తి చేసింది. దీనిలో భాగంగా అక్టోబర్‌లో జరిగే తదుపరి ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశాని కంటే ముందే ఇస్లామాబాద్‌లో పర్యటించనున్నట్లు ఎఫ్‌ఏటీఎప్‌ తెలిపింది. ఆ పర్యటనలో ఇస్లామాబాద్‌లో ఉగ్రవాదం, మనీలాండరింగ్‌ సంబంధించిన ఆర్థిక విషయాల్లో ఏర్పాటు చేసిన చట్టాలు, తీసుకుంటున్న చర్యలను గురించి ఎఫ్ఏటీఎప్‌ తనీఖీలు చేయనున్నట్లు చెప్పారు.

ఈ క్రమంలో పాక్‌ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖార్ మాట్లాడుతూ…ఈ జాబితా నుంచి పాక్‌ కచ్చితంగా తప్పుకుంటుందని విశ్వసిస్తున్నామన్నారు. పాక్‌లో త్వరలో కొత్త సంస్కరణ జరుగుతాయన్నారు. ఇది ఒక రకంగా పాక్‌ ఆర్థిక వ్యవస్థ పై విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి దోహదపడుతుందని… గ్రే లిస్ట్‌ నుంచి నిష్క్రమించడం వల్ల విదేశీ పెట్టుబడులు, పెరుగడమే కాకుండా, ఐఎంఎప్‌ రుణాలను కూడా పొందగలుగుతుందన్నారు. మళ్లీ పాక్‌ ఇలాంటి గ్రే లిస్ట్‌లోకి వెళ్లకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

fifteen + two =