More

  బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్.. కోడ్ నేమ్ తెలుసా..?

  పాకిస్తాన్…అబ్దాలే పునాదిగా పుట్టిన దేశం. ఇంకా చెప్పాలంటే దేశ విభజన సమయంలో… ఆ అబ్దాల పునాదిగా…, డైరెక్ట్ యాక్షన్ పేరుతో…  రక్తపుటెరులు పారించిన దేశం..! దాని నైజం…, దాని పుట్టుక.., దాని మనుగడకు ఏకైక ఆధారం… ఇస్లామిక్ మతోన్మాదం.. హిందూ వ్యతిరేకత..! భారత వ్యతిరేకత…!  భారత్ నుంచి విడిపోయిన ఆ దేశం ఇప్పుడు 70 ఏళ్ళు గడిచిన తర్వాత… ప్రపంచంలోనే ఓ విఫల దేశం.!

  ఇంతటి నీచ చరిత్ర కలిగిన పాకిస్తాన్ అంటే మన దేశంలోని సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్ మేధావులకు, సూడో సెక్యురిలిస్టులకు వళ్లమాలిన ప్రేమ. పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడి నరమేధం సృష్టించినా…, వారు మాత్రం శాంతివచనలనే మనకు వళ్లవేస్తుంటారు. తమదైన తప్పుడు కథనాలు, తర్కాలతో… పాక్ విషయంలో భారత్ ఎప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోకుండా, ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తారు. మన దేశంలో ఇలాంటి పాక్ లాబీయిస్టులకు కొదవలేదు. నేషలన్ మీడియాలోని సీనియర్ జర్నలిస్టుల నుంచి మొదలు పెడితే…బాలీవుడ్ స్టార్ల వరకు ఈ పాకిస్తాన్ స్పానర్డ్ ఈ అమన్ ప్రేమికులే దర్శనమిస్తారు. ఇక అసలు విషయానికి వద్దాం. పుల్వామా ఘటన జరిగి రెండేళ్ళు పూర్తయన సందర్భంలో  భారత్ తోపాటు అటు పాకిస్తాన్ కూడా కొత్త విషయాలు వెలుగులోకి తీసుకువచ్చాయి. ఆనాటి దాడికి సంబంధించి భారత్ పెట్టుకున్న కోడ్ వార్డును బయట పెట్టగా…, పాకిస్తాన్ అభినందన్ తమ చెరలో ఉన్నప్పటి ఓ వీడియోను విడుదల చేసింది.   

  సీఆర్ఫీఎఫ్ జవాన్ల కాన్వాయ్ పై పుల్వామాలో పాక్ ప్రేరిత ఉగ్రవాదులు  జరిపిన దాడి ఘటన భారత దేశ ప్రజల్ని ఎంతగానో కలిచివేసింది. ఈ ఘటనలో 40 మందికిపైగా జవాన్లు అమరులయ్యారు. ఈ దాడికి ప్రతీకారంగా సరిగ్గా రెండేళ్ళ క్రితం 2019 ఫిబ్రవరి 26వ తేదీన…పాకిస్తాన్ బాలాకోట్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడులు చేసింది.  తెల్లవారు జామున 3.03 గంటలకు భారత మిరాజ్ 2000 ఫైటర్ జెట్స్… లైన్ ఆఫ్ కంట్రోల్ దాటుకుని పాకిస్తాన్ లోని బాలాకోట్ లోని జైషే మహ్మమద్ టెర్రర్ క్యాంప్ పై దాడి చేశాయి.

  నాటి ఈ వైమానిక దాడికి సంబంధించి ఇప్పుడు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. మన మిరాజ్ ఫైటర్ జెట్స్ ని ఎదిరించేందుకు పాకిస్తాన్ తన ఎఫ్ 16 ఫైటర్ జెట్స్ ను రంగంలోకి దించింది. ఎఫ్ 16ను తప్పుదొవ పట్టిస్తూ…. భారత ఫైటర్ పైలట్లు అనుకున్న లక్ష్యంపై బాంబులు జారవిడిచి సురక్షితంగా భారత్ కు తిరిగి వచ్చారు. ఆనాటి ఎయిర్ చీఫ్ మర్షల్ బీఎస్ ధనోవా… బందర్ మారా గయా అంటూ కోడ్ వార్డులో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కు…వైమానిక దాడి సక్సెస్ అయిన విషయాన్ని వెలడించారు.

  అయితే… బాలాకోట్  దాడికి ప్రతీకారంగా ఆ మరుసటి రోజే… పాకిస్తాన్ కూడా… తన ఎఫ్ 16 యుద్ధ విమానంతో  2019 ఫిబ్రవరి 27న కశ్మీర్ లోకి చొరబడేందుకు యత్నించింది. దీంతో అప్రమత్తమైన భారత వింగ్ కమాండర్ అభినందన్… తన మిగ్ 21 విమానంతో పాకిస్తాన్ కు చెందిన ఎఫ్16 యుద్ధ విమానాన్ని వెంటాడి మరి కూల్చివేశారు. అయితే ఈ పోరాటలో తన విమానం కూడా కూలిపోవడంతో ఆయన అత్యవసరంగా కిందకు దిగారు. అయితే అది పాక్ భూభాగం కావడంతో అభినందన్ ను పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది.

  వెంటనే.. అభినందన్ ను సురక్షితంగా భారత్ కు తిరిగి అప్పగించకపోతే… పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మోదీ ప్రభుత్వం హెచ్చరించింది. భారత త్రివిధ దళాలకు మోదీ ప్రభుత్వం ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. అంతేకాదు అన్నట్లుగానే ఆ రాత్రికి పాకిస్తాన్ పై ముప్పేటగా వైమానిక దాడికి ప్లాన్ చేసింది. దీంతో పాకిస్తాన్ దిగివచ్చి అభినందన్ ను భారత్ కు తిరిగి అప్పగించింది.

  అయితే అభినందన్ పాకిస్తాన్ చెరలో బంధిగా ఉన్న సమయంలో ఆయన్ను ఎన్నో యాతనలకు గురిచేసింది. తాను సేఫ్ గా ఉన్నానని…, తను పాకిస్తాన్ ఆర్మీ ఎంతో మంచిగా చూసుకుందని,  రెండు దేశాల మధ్య శాంతి సాధన జరగాలని అభినందన్ పాక్ చెరలో ఉన్నప్పుడు తీసిన ఓ వీడియోను పాకిస్తాన్ పుల్వామా ఘటన జరిగి రెండేళ్లు అవుతున్న సందర్భంగా విడుదల చేసింది. రెండు నిమిషాల నిడివిడితో ఉన్న వీడియోలో 16 సార్లు కట్స్ ఉన్నాయని ఇదంతా డాక్టర్డు వీడియోని చూస్తూనే తెలిసిపోతుంది. తమకు యుద్ధం వద్దు.. శాంతి కావాలి. ఆ శాంతి సాధన కోసమే తాము అభినందన్ విడుదల చేశామని.. పాక్ మీడియాలు కట్టుకథలు చెబుతున్నాయి. అభినందన్ ను విడుదల చేయకపోతో… భారత్ తమపై యుద్ధానికి వస్తుందని…ఆ దేశ సైన్యాధ్యక్షుడు జనరల్ బజ్వా వణికిపోయారని పాకిస్తాన్ పార్లమెంటు సభ్యులే…ఆ దేశ నేషనల్ అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని మాత్రం పాక్ మీడియా మర్చిపోయింది.

  Trending Stories

  Related Stories