More

    ఉగ్రవాద దేశానికి డ్రాగన్ దేశం మరోసారి భారీ సాయం..!

    డ్రాగన్ దేశం తన బుద్ధిని మార్చుకోవడం లేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు అన్ని విధాలుగా అండగా నిలవడమే కాదు.. ఆర్థిక సాయం కూడా భారీగా చేస్తోంది.

    ఇప్పటికే చాలా సార్లు పాకిస్తాన్ భారీ ఎత్తున ఆర్థిక సాయం చేసిన చైనా.. తాజాగా మరోసారి భారీ ఆర్థిక సాయం అందించింది. ఆర్థికంగా చాలా నష్టాల్లో ఉన్న పాకిస్తాన్‌కు చైనా నుంచి సహకారం లభించింది. ఈ విషయాన్ని పాక్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ వెల్లడించారు. శుక్రవారం నాడు ట్విట్టర్ వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు. కొన్నిరోజుల క్రితమే దీని గురించి ఆయన హింట్ ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు చైనాకు చెందిన బ్యాంకుల కన్సార్షియం తమ దేశానికి సుమారు 2.3 బిలియన్ డాలర్ల అప్పు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయని, మరికొన్ని రోజుల్లో ఈ సొమ్ము పాక్ ఖాతాలకు చేరుతుందని ఇస్మాయిల్ ఇదివరకే ట్వీట్ చేశారు.

    తాజాగా ఈ సొమ్ము స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ఖాతాకు చేరినట్లు ఆయన వెల్లడించారు. దీంతో పాక్ విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పెరిగాయని తెలిపారు. కొన్నిరోజులుగా ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడుతున్న పాక్.. శ్రీలంక బాటలోనే నడిచేలా కనిపించింది. చివరకు ప్రజలు తాగే టీ కూడా రోజుకు రెండు, మూడు కప్పులే తాగాలని ఆ దేశ మంత్రులు సూచనలు ఇచ్చే స్థాయికి ఆ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఇలాంటి సమయంలో చైనా నుంచి ఆర్థిక సహాయం లభించడంతో ఆ దేశం కొంత తేరుకున్నట్లేనని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

    spot_img

    Trending Stories

    Related Stories