26/11 ఉగ్రదాడి కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు..!

0
774

పాకిస్థాన్‌ కోర్టు కనీవినీ ఎరుగని అత్యంత సంచలన తీర్పును వెలువరించింది. తీవ్రవాద ఫైనాన్సింగ్ కేసులో 2008 ముంబై ఉగ్రదాడుల ప్రధాన హ్యాండ్లర్‌‎కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో నిషేధిత లష్కరే తోయిబా కార్యకర్త సాజిద్ మజీద్ మీర్‌కు లాహోర్‌లోని యాంటీ టెర్రరిజం కోర్టు ఈ నెల ప్రారంభంలో 15 ఏళ్ల జైలుశిక్ష విధించిందని LeT, జమాత్ ఉద్ దవా నాయకుల ఫైనాన్సింగ్ కేసులకు సంబంధించిన సీనియర్ న్యాయవాది చెప్పారు. దశాబ్ద కాలంగా అమెరికా, భారత్ వాంటెడ్ లిస్టులో ఉన్న సాజిద్‌ మీర్ చనిపోయాడని భావించారు. అయితే పంజాబ్ పోలీస్‌లోని కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్, ఇలాంటి కేసుల్లో అనుమానితులకు సంబంధించిన నేరారోపణలను తరచుగా మీడియాకు తెలియజేస్తుంది. అయితే, తీవ్రవాద ఫైనాన్సింగ్ కేసులో మీర్‌కు శిక్ష విధించినట్లు తెలియజేయలేదు. అంతేకాకుండా, జైల్లో జరిగే ఇన్ కెమెరా ప్రొసీడింగ్ కావడంతో మీడియాను అనుమతించలేదు. మరోపక్క, ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌కు లాహోర్ యాంటీ టెర్రర్ కోర్టు ఇప్పటికే ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసుల్లో 68 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ముంబయి దాడి ఆపరేషన్‌ కమాండర్‌ జకీవుర్‌ రెహ్మాన్‌ లఖ్వీ కూడా కొన్నేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. సయీద్, మాకీ ఇద్దరూ లాహోర్‌లోని కోట్ లప్‌ఖాప్ట్ జైలులో ఉన్నారు.

40 ఏళ్ల మధ్యలో ఉన్న దోషి సాజిద్ మీర్ ఈ ఏప్రిల్‌లో అరెస్టు చేసినప్పటి నుండి కోట్ లఖ్‌పత్ జైలులో ఉన్నారని న్యాయవాది తెలిపారు. కోర్టు దోషికి రూ.4 లక్షలకు పైగా జరిమానా కూడా విధించిందని ఆయన చెప్పారు. 166 మందిని పొట్టనబెట్టుకున్న 26/11 ముంబై దాడుల్లో కీల‌క సూత్ర‌ధారిగా ఉన్న సాజిద్ మీర్ అమెరికా, భార‌త్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. అత‌ని స‌మాచారం అందించిన వారికి 5 మిలియన్ డాలర్ల రివార్డును కూడా ప్ర‌క‌టించారు. మీర్‌ను ముంబై దాడులకు ప్రాజెక్ట్ మేనేజర్ అని పిలిచేవారు. అతను 2005లో నకిలీ పేరుతో పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి భారతదేశానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. అంతకుముందు, జూన్ 14-17 మధ్య బెర్లిన్‌లో జరిగిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ప్లీనరీ సమావేశంలో పాకిస్తాన్ అధికారులు సాజిద్ మీర్‌ను ఏప్రిల్‌లో అరెస్టు చేశారని, విచారణ తర్వాత ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించారని పాశ్చాత్య మధ్యవర్తులకు తెలియజేసారు.

టెర్రర్ ఫైనాన్సింగ్‌కు దారితీసే మనీలాండరింగ్‌ను తనిఖీ చేయడంలో విఫలమైనందుకు పాకిస్తాన్ జూన్ 2018 నుండి FATF గ్రే లిస్ట్‌లో చేర్చబడింది. FATF అనేది గ్లోబల్ మనీలాండరింగ్ మరియు టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ వాచ్‌డాగ్. ఇది చ‌ట్ట విరుద్ధ కార్యకలాపాలను నిరోధించడం, సమాజానికి హాని కలిగించే లక్ష్యాల‌ను అడ్డుకునే చ‌ర్య‌ల‌తో ముందుకుసాగుతుంది. పాకిస్థాన్ గ్రే లిస్టులో ఉండ‌టంతో ఆ దేశంపై అంత‌ర్జాతీయంగా తీవ్ర ప్ర‌భావం ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే సాజిద్ మీర్‌ను అరెస్టు చేయడం గ్రే లిస్ట్ నుండి బయటపడాలని పాకిస్తాన్ ప్రభుత్వం బాగా ఆలోచించిన ప్రణాళిక అని భద్రతా నిపుణులు భావిస్తున్నారు. మీర్ అరెస్టు ద్వారా పాకిస్థాన్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు చూపించాలనుకుంటోందని నిపుణులు చెబుతోంది. FATF ఈ సంవత్సరం జర్మనీలో జరిగిన దాని సమావేశంలో వీలైనంత త్వరగా పాకిస్తాన్‌లో ఆన్-సైట్ పర్యటనను నిర్వహిస్తుందని, ఆ దేశం దాని గ్రే లిస్ట్ నుండి తొలగించబడే అవకాశం ఉందని ప‌లు మీడియా నివేదిక‌లు వెల్లడించాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

2 × 4 =