పాకిస్తాన్ కు భారతే శరణ్యమా?

0
811

అవును.. పాకిస్తాన్ దారికి వస్తోంది.! అయితే పాకిస్తాన్ ఇలా దారికి రావడానికి అమెరికా నూతన అధ్యక్షుడు బైడన్ కారణమని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. మరికొందరైతే సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఉన్నాడని చెబుతున్నారు. అయితే వీటిలో ఏదీ నిజం? కశ్మీర్ కోసం అవసరమైతే వెయ్యి యుద్ధాలైనా చేస్తామని బీరాలు పలికిన పాకిస్తాన్ పాలకులు ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా శాంతి మంత్రం జపించడానికి అసలు కారణం వేరేనే ఉందని కొంతమంది నేషనలిస్ట్ థింకర్స్ అంటున్నారు. ప్రధాని మోదీ, ఎన్ఏస్ఏ అజిత్ దోవల్, భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ త్రయం జరిపిన దౌత్యనీతితోనే.., పాకిస్తాన్ దారికి వచ్చిందని చెబుతున్నారు.

పాకిస్తాన్… డ్రాగన్ చైనా అండ చూసుకుని భారత్ తో కయ్యానికి కాలుదువ్వింది. భారత్ లో అంతర్భాగమైన జమ్మూకశ్మీర్ లో అరిక్టల్ 370ని రద్దు చేసిన తర్వాత..,  భారత్ ఇక మాటల్లేవ్.., మాట్లాడుకోవడాల్లేవ్ అంటూ అన్ని సంబందాలను తెంచుకుంది. అటు చైనా కూడా  పాకిస్తాన్ కు అండగా మేము ఉన్నామని భారత వ్యతిరేక చర్యల ద్వారా చెప్పుకునే ప్రయత్నం చేసింది.

అయితే డ్రాగన్ తో జుగల్ బందీ ఎప్పటికైనా డేంజరనే విషయం భారత్ కు బాగా తెలుసు. కానీ పాకిస్తాన్.. డ్రాగన్ ను నమ్మి అప్పుల పాలైంది. పాకిస్తాన్ కు ప్రపంచంలో అప్పు పుట్టని పరిస్థితి దాపురించింది. సౌదీ అరేబియా, మలేషియా దేశాలైతే ఇచ్చిన అప్పులు చెల్లించాల్సిందేనని పాకిస్తాన్ కు అల్టిమేటం ఇచ్చాయి.

అటు ఆసియా ఖండం పెద్దన్నగా ఎదుగుతున్న ఇండియాను కట్టడి చేయాలంటే, డ్రాగన్ చైనానే ది బెస్ట్ అని పాకిస్తాన్ నమ్మింది. అయితే మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం ఏక కాలంలో అటు పాకిస్తాన్ కు  ఇటు చైనాకు తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చింది.  తూర్పు లద్దాఖ్ లో చైనా దురాక్రమణను అంతే స్థాయిలో భారత సైన్యం తిప్పికొట్టింది. చైనా బెదిరింపులకు భయపడేది లేదని తెగేసి చెప్పింది. ఏ నయా భారత్ … , దుష్మన్ కే ఘర్ మే గుసుకే మారేగా అంటూ డ్రాగన్ కు దీటుగా బదులిచ్చింది.

గల్వాన్ వ్యాలీలోకి చొచ్చుకురావడమే కాకుండా వితండవాదానికి దిగిన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి గట్టిగా బుద్దిచెప్పింది. చివరకు భారత సైనికులతో జరిగిన పోరాటంలో మరణించిన తమ దేశ సైనికుల వివరాలను సైతం బయటపెట్టేందుకు డ్రాగన్ చైనా.. ఆ దేశ కమ్యూనిస్టు పాలకులు జంకారంటే  భారత్ కొట్టిన దెబ్బ ఎంతటి స్ట్రాంగ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు.!

అటు  సైనికపరమైన చర్చలతో కాలయాపన చేసి..,  భారత్ ను మభ్యపెట్టాలని చూసింది చైనా.! అయితే చర్చల సమయంలోనూ భారత సైనిక అధికారులు ధృడంగా నిలువడంతో…,  ఇక వెనక్కు మళ్లడం తప్ప… డ్రాగన్ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి మరోదారి లేకపోయింది.

పాకిస్తాన్….ఏ డ్రాగన్ చైనానైతే.., తాను ఆసియా ఖండం పెద్దన్నగా భావించిందో., అదే డ్రాగన్ చైనా.., భారత్ సయోధ్యకు తహతహలాడంతో ఇక మనం ఎంత అని భావించిన పాకిస్తాన్ పాలకులే.., ఏలాగైనా సరే భారత్ తో తమకు సయోధ్య కుదర్చాలని,  యూఏఈ, సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు పాక్  పాలకులకు విన్నవించుకున్నారని జాతీయవాద జర్నలిస్టులు చెబుతున్నారు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ తోపాటు యూఏఈ పాలకులతో పీఎం మోదీకి మంచి సత్ సంబంధాలున్నాయనే విషయం అందరికి తెలిసిందే.ఈ కారణంగానే మోదీ సర్కార్..,  దివాళ తీసిన పాకిస్తాన్ తో చర్చలకు అంగీకరించిందని అంటున్నారు.

హిందూ వ్యతిరేకతే…పాకిస్తాన్ అనే దేశం పుట్టుకకు పునాది. భారత్ ను వ్యతిరేకించడమే పాక్ పాలకులకు, అక్కడి పార్టీల రాజకీయ మనుగడకు ప్రధానమనే విషయం మనం మర్చిపోరాదు. అయితే భారత్ విధించిన షరతులకు పాకిస్తాన్ ఎక్కడ లొంగిపోయిందనే అపవాదు రాకుండా ఉండేందుకు.., పాక్ ఇమ్రాన్ ప్రభుత్వం తగు జాగ్రతలు తీసుకుందని., ఆ కారణంగానే భారత్ తో రహస్యంగా చర్చలు కొనసాగించిందని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ క్రమంలో భారత ప్రధాని మోదీ కూడా ఒక అడుగు ముందుకు వేశారు. పాకిస్తాన్ డే ను పురస్కరించుకుని ఇమ్రాన్ కు లేఖ రాశారు పీఎం మోదీ. అలాగే ఇమ్రాన్ కు కరోనా సోకిందన్నప్పుడు కూడా  మోదీ స్పందించారు. ఇమ్రాన్ త్వరగా కొలుకోవాలని ఆకాంక్షించారు. అటు మోదీ రాసిన లేఖకు ప్రతిగా ఇమ్రాన్ కూడా మోదీకి కృతజ్ఞతలు చెబుతూ లేఖ రాశాడు. భారత్ సహా పొరుగు దేశాలన్నిటితోనూ, పాకిస్తాన్ ప్రజలు… శాంతిని, పరస్పర సహకారాన్ని కోరుకుంటున్నారని, అయితే ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య

వివాదాలు పరిష్కామైతేనే, ప్రత్యేకించి జమ్మూ కశ్మీర్ వివాదానికి ముగింపు పలికితేనే దక్షిణ ఆసియాలో శాంతి, సుస్థిరత సాధ్యం అవుతాయి” అని ఇమ్రాన్  తన లేఖలో సంధిప్రస్తావనలు చేశారు. చర్చల ద్వారానే రెండు దేశాల మధ్య స్నేహ వాతావరణం ఏర్పడుతుందన్న ఇమ్రాన్.. కరోనా మహమ్మారిపై భారత ప్రజలు అద్భుతంగా పోరాడుతున్నారంటూ కితాబు ఇచ్చారు.

అలాగే ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన ఇమ్రాన్ ప్రభుత్వం.., భారత్ తో తిరిగి వాణిజ్య సంబంధాలను పునరుద్దరించుకుని ఆర్థిక గండం నుంచి బయటపడాలని భావిస్తోంది.  భారత్ నుంచి చక్కెర, పత్తి దిగుమతి విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. అటు పాకిస్తాన్ క్యాబినెట్ కు చెందిన ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీ మార్చి 31 బుధవారం రోజున జరిపిన సమావేశంలో ఈ తాజా ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని పాక్ మీడియా పేర్కొంది. నిషేధం ఎత్తేసిన జాబితాలో చక్కెర, పత్తితోపాటు మరో 21 రకాల వస్తువులు కూడా ఉన్నాయని తెలిపింది.

అప్పుల ఊబి, అదుపు తప్పిన ద్రవ్యోల్బణం, అధిక ధరలతో అల్లాడిపోతున్న తమ దేశానికి భారత్ నుంచి చేసుకునే దిగుమతులతో కొంతలోకొంతైనా గట్టేక్కాలని పాకిస్తాన్ పాలకులు భావిస్తున్నారు. భారత్ తో పోటీగా బీరాలకు పోయిన పాకిస్తాన్.., చివరకు భారత్ తో శాంతి చర్చల ప్రస్తావన చేసిందంటే అది సంగం చచ్చినట్లేనని, ఇక చచ్చిన పామును ఏం చంపుతామని కొంతమంది విశ్లేషకులు వాఖ్యానిస్తున్నారు.  

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

16 − fourteen =