More

    బైడెన్ వ్యాఖ్యలపై స్పందించిన పాక్ ప్రధాని

    పాకిస్థాన్ దగ్గర ఉన్న అణ్వాయుధ సామర్థ్యంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. పాక్ అత్యంత ప్రమాదకర దేశమనే వ్యాఖ్యలలో ఏ మాత్రం నిజం లేదని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు. గత దశాబ్దాలుగా పాకిస్థాన్ అత్యంత బాధ్యతాయుతమైన అణు రాజ్యంగా నిరూపించబడిందని.. మా అణు కార్యక్రమం సాంకేతికంగా, ఫూల్‌ప్రూఫ్ కమాండ్, కంట్రోల్ సిస్టమ్ ద్వారా నిర్వహించబడుతుందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. పాకిస్థాన్, అమెరికా ఎంతో కాలంగా స్నేహపూర్వక, పరస్పర ప్రయోజనకరమైన సంబంధాలు కలిగి ఉన్నాయని.. ప్రపంచం భారీ సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో పాక్ నిజమైన సామర్థ్యాన్ని గుర్తించడానికి, ప్రయత్నాలు చేయాలని అన్నారు.

    శుక్రవారం డెమొక్రాటిక్ కాంగ్రెస్ ప్రచార కమిటీ రిసెప్షన్‌లో జో బైడెన్ మాట్లాడుతూ ‘‘ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దేశాలలో పాకిస్తాన్‌ను ఒకటిగా నేను భావిస్తున్నాను. పాకిస్తాన్ ఏ విధమైన సమన్వయం లేకుండా అణ్వాయుధాలు కలిగి ఉంది’’ అని అన్నారు. చైనా, రష్యాలకు సంబంధించి అమెరికా విదేశాంగ విధానంపై మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు పాక్ పై ఈ వ్యాఖ్యలు చేశారు. నేను ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దేశాలలో పాకిస్థాన్ అని భావిస్తున్నాను.. ఎలాంటి సమన్వయం లేకుండా అణ్వాయుధాలు ఉన్నాయని.. బిడెన్ వ్యాఖ్యలను వైట్ హౌస్ పత్రికా ప్రకటనలో కూడా ఉటంకించాయి.

    Trending Stories

    Related Stories