More

    వాటిని కొని.. చైనా చేతిలో అడ్డంగా మోసపోయిన పాకిస్తాన్

    పాకిస్తాన్.. ఇటీవలి కాలంలో చైనాకు ఎంతగానో దగ్గరైంది. చైనా కూడా పాకిస్తాన్ ను బాగానే వాడుకుంటూ ఉంది. ఎన్నో వస్తువులను కూడా చైనా దగ్గర పాకిస్తాన్ ను కొంటూ ఉంది. యుద్ధ రంగానికి చెందిన వస్తువులను కూడా పాక్ చైనాను నమ్మి కొంటూ ఉంది. అయితే ఇలా చైనా చేతిలో యుద్ధ సామాగ్రిని కొని పాక్ అడ్డంగా మోసపోతోందని తెలుస్తోంది.

    భారతదేశం ఇటీవలి కాలంలో వాయు రక్షణ సామర్థ్యాలను బలపరుచుకుంటూ ఉంది. భారత్ ను అడ్డుకోవాలని.. మన వాయు రక్షణ సామర్థ్యాలకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఈ ఏడాది మార్చి 12 న చైనా తయారు చేసిన లో-టు-మీడియం ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (లోమాడ్స్) ఎల్వై 80 ను తీసుకుంది. అయితే ఇవి ప్రస్తుతం పని చేయడం లేదని తెలుస్తోంది. భవిష్యత్తులో ఇవి పాకిస్తాన్‌కు పెద్ద ఇబ్బందిగా తయారవ్వనున్నాయి. తక్కువ-నాణ్యత గల చైనా నిర్మిత క్షిపణులు ‘పనిచేయడం లేదు’ అని పాక్ నిపుణులు చెబుతూ ఉన్నారనే కథనాలు వైరల్ అవుతున్నాయి. చైనా సాంకేతిక నిపుణులు గత రెండు నెలలుగా పాకిస్తాన్లో ఉన్నారట.. ఈ వ్యవస్థలను మరమ్మతు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి అదనంగా పాకిస్తాన్ అటువంటి మరో ఆరు వ్యవస్థల కోసం ఒక ఆర్డర్ ఇచ్చింది.

    తక్కువ మరియు మధ్యస్థ ఎత్తులో ఎగురుతున్న వైమానిక లక్ష్యాలను అడ్డుకుని నాశనం చేయడంలో లోమాడ్స్ LY-80 దిట్ట. పాకిస్తాన్ దేశంలోని తొమ్మిది ప్రదేశాలలో లోమాడ్స్‌ను మోహరించింది. ఈ వ్యవస్థలను పరిష్కరించడానికి చైనా సాంకేతిక నిపుణుల బృందం ప్రతి ప్రదేశానికి పంపబడింది. వీరు వాటిని పని చేసేలా చేస్తారో.. లేదో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా తాము చైనా మిసైల్స్ ను నమ్ముకుని అడ్డంగా మోసపోయామని పాక్ నాయకులు చెబుతూ ఉన్నారు.

    అగ్ని మిసైల్ ను విజయవంతంగా పరీక్షించిన భారత్:

    మరోవైపు, ఒడిశా తీరంలో అగ్ని సిరీస్‌లో అగ్ని పి- కొత్త క్షిపణిని భారతదేశం విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్ష విజయవంతమైందని డి.ఆర్.డి.ఓ. తెలిపింది. “తూర్పు తీరం వెంబడి ఉన్న వివిధ టెలిమెట్రీ మరియు రాడార్ స్టేషన్లు క్షిపణిని ట్రాక్ చేసి పర్యవేక్షించాయి. క్షిపణి అద్భుతంగా పని చేస్తోందని.. లక్ష్యాలను ఖచ్చితత్వంతో చేరుకుంటోంది” తెలిపింది. దీనికి ముందు,డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) గత వారం చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటిఆర్) వద్ద దేశీయంగా అభివృద్ధి చేసిన పినాకా రాకెట్ ఎక్స్ టెండెడ్ వెర్షన్‌ను విజయవంతంగా పరీక్షించింది.

    Related Stories