అంతర్జాతీయంగా పాక్ పరువు తీసేసిన జో బైడెన్

0
930

పాకిస్తాన్‌‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దేశాలలో పాక్ ను ఒకటిగా అభివర్ణించారు. శుక్రవారం డెమొక్రాటిక్ కాంగ్రెస్ ప్రచార కమిటీ రిసెప్షన్‌లో జో బైడెన్ మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. చైనా, రష్యాలకు సంబంధించి అమెరికా విదేశాంగ విధానంపై మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు పాక్ పై ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా గురించి ప్రస్తావిస్తూ, ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో వ్యవహరించే పనిని తనకు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అప్పగించారని చెప్పారు. అమెరికా అధినేతల్లో ఎవరూ గడపనంత ఎక్కువ సమయం తాను జిన్‌పింగ్‌తో గడిపానని చెప్పారు. ఆయనతో తాను 78 గంటలు చర్చించానని చెప్పారు. వీటిలో 68 గంటలు గత పదేళ్ళలో వ్యక్తిగతంగా సమావేశమయ్యానని చెప్పారు. వైస్ ప్రెసిడెంట్‌తో డీల్ చేయలేనని బరాక్ ఒబామాకు తెలుసునని చెప్పారు. అందుకే ఆ బాధ్యతను ఆయన తనకు అప్పగించారన్నారు. జిన్‌పింగ్‌కు తనకు ఏం కావాలో తనకు తెలుసునన్నారు. కానీ చాలా చాలా సమస్యలు ఉన్నాయని చెప్పారు. రష్యాలో ఏమి జరుగుతుందో దానికి సంబంధించి మనం ఎలా ముందుకు వెళ్ళాలో తెలుసు? నేను ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దేశాలలో పాకిస్థాన్ అని భావిస్తున్నాను.. ఎలాంటి సమన్వయం లేకుండా అణ్వాయుధాలు ఉన్నాయని.. బిడెన్ వ్యాఖ్యలను వైట్ హౌస్ పత్రికా ప్రకటనలో ఉటంకించాయి. ‘‘ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దేశాలలో పాకిస్తాన్‌ను ఒకటిగా నేను భావిస్తున్నాను. పాకిస్తాన్ ఏ విధమైన సమన్వయం లేకుండా అణ్వాయుధాలు కలిగి ఉంది’’ అని బైడెన్ పేర్కొన్నారు.