పిఎఫ్ఐ పై బ్యాన్ ను వ్యతిరేకిస్తున్న పాకిస్తాన్ పెద్దలు

0
951

ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ), దాని అనుబంధ సంస్థలను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిషేధించిన సంగతి తెలిసిందే. యూఏపీఏ చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలు తీవ్రవాదం, దానికి కావాల్సిన నిధులు సమకూర్చడం, ఉగ్రవాదంపై యువతకు శిక్షణ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయని ఎన్‌ఐఏ నిర్దారించింది. పీఎఫ్‌ఐతో పాటు దాని అనుబంధ సంస్థలు రెహాబ్ ఇండియా ఫౌండేషన్ (ఆర్ఐఎఫ్), క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ), ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ (ఏఐఐసీ), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ (ఎన్సీహెచ్ఆర్వో), నేషనల్ విమెన్స్ ఫ్రంట్ (ఎన్‌డబ్ల్యూఎఫ్), జూనియర్ ఫ్రంట్ (జేఎఫ్), ఎంపవర్ ఇండియా ఫౌండేషన్ (ఈఐఎఫ్), రెహాబ్ ఫౌండేషన్ (కేరళ)పై నిషేధం విధించింది. పీఎఫ్ఐ, దానికి అనుబంధంగా కొనసాగుతున్న 8 సంస్థలపై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)కి మద్దతుగా పాకిస్తాన్ నాయకులు, అధికారులు బహిరంగంగా మద్దతుని ఇచ్చారు. PFI, దాని అనుబంధ సంస్థలపై విధించిన నిషేధంతో ఉలిక్కిపడిన పాకిస్తాన్.. ఇప్పుడు పిఎఫ్‌ఐ కి అంతర్జాతీయ మద్దతును సేకరించేందుకు ప్రయత్నించింది. పాకిస్తాన్ కాన్సులేట్ జనరల్ వాంకోవర్ అధికారిక హ్యాండిల్ ద్వారా చేసిన ట్వీట్‌కు ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్‌తో అనుబంధంగా ఉన్న వివిధ సంస్థల ట్విట్టర్ హ్యాండిల్స్‌ను ట్యాగ్ చేసింది. “Massive arrests are going on in the BJP-ruled states in the name of Preventive Custody. This is nothing but Prevention of d Right to democratic protests against d Central government’s witch-hunt targeting PFI is Quite natural & expected under this autocratic system.” అంటూ ట్వీట్ చేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రివెంటివ్ కస్టడీ పేరుతో పెద్దఎత్తున అరెస్టులు జరుగుతున్నాయి. ఇది PFIని లక్ష్యంగా చేసుకుని భారత ప్రభుత్వం చేస్తున్న వేట అంటూ అబద్దాలు ప్రచారం చేయడం మొదలుపెట్టింది. అంతేకాకుండా పలువురు పాక్ రాజకీయ నాయకులు కూడా పిఎఫ్‌ఐని బ్యాన్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు.