విగ్రహాల తలలను తీసేశారు.. దుర్గమ్మ ఆలయం ధ్వంసం..!

0
1089

హిందూ దేవాలయాలపై అక్కడ ఏ మాత్రం దాడులు ఆగడం లేదు. పాకిస్థాన్‌లో హిందూ దేవాలయాల ధ్వంసం చేసిన ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్‌ కరాచీలోని నారాయణ్ పురా ప్రాంతంలో దుర్గామాత ఆలయంపై దాడి చేసి దుర్గామాత విగ్రహాలను ధ్వంసం చేశారు. గత 22 నెలల్లో హిందూ దేవాలయాలపై పాకిస్థాన్ లోని ఇస్లాంవాదులు జరిపిన 9వ దాడి ఇది అని తెలుస్తోంది. వార్తలు బయటకు రాకుండా ఇంకెన్ని దేవాలయాలపై దాడులు జరిగాయోననే విషయమై ఇంకా క్లారిటీ లేదు.

A Hindu temple has been vandalized in Karachi, Pakistan, under construction  - Keademy.com

ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. దుర్గా విగ్రహం తల తెగిపడిపోయింది. మరో దేవత విగ్రహం తీవ్రంగా ధ్వంసం చేశారు. దాడిలో దుర్గా విగ్రహం మొండెం కూడా విరిగిపోయిందని, ఆలయం పూర్తిగా ధ్వంసమైందని సమాచారం. అమ్మవారి వాహనమైన పులి బొమ్మను కూడా ధ్వంసం చేసి ఉండడాన్ని మనం వైరల్ వీడియోలో చూడొచ్చు. ఆలయంలోని పటాలను కూడా కింద పడేసి పగులగొట్టారు.

ఈ ఘటనకు సంబంధించి మహ్మద్ వలీద్ షబ్బీర్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు పాక్ మీడియా తెలిపింది. తన భార్యతో కలిసి ఆలయంలో ఉన్న ఒక హిందూ వ్యక్తి ముఖేష్ కుమార్.. మహమ్మద్ విగ్రహాలను సుత్తితో పగులగొడుతూ ఉండడాన్ని చూశాడు. చివరకు పోలీసులు అప్రమత్తమై అతడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆలయం ఉన్న ప్రాంతంలో పేద హిందూ కుటుంబాలు నివసిస్తున్నాయి. హిందువులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ వెలుపల నిరసనలు చేపట్టారు.

ఈ సంవత్సరం ప్రారంభంలో పాకిస్థాన్ లోని ఛాందసవాదుల గుంపు పాకిస్తాన్‌లోని పంజాబ్‌లోని గణేష్ ఆలయంపై దాడి చేసింది. ఆలయ భాగాలను తగలబెట్టి, విగ్రహాలను అపవిత్రం చేసింది. ఆ గుంపు కర్రలు, రాళ్లు, ఇటుకలను తీసుకువెళ్లి, మతపరమైన నినాదాలు చేస్తూ దేవతల విగ్రహాలను ధ్వంసం చేసినట్లు అధికార పార్లమెంటు సభ్యుడు పేర్కొన్నారు.

ఛాందసవాదులకు వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి చర్యలు తీసుకునే దమ్ము లేదని స్పష్టంగా తెలుస్తోంది. మైనారిటీల దేవాలయాలను రక్షించడంలో అసమర్థత కారణంగా పాక్ లో హిందువులు ఉండడానికే భయపడుతూ ఉన్నారు.

Extremists vandalize Durga idol in Pakistan, 9th attack on Hindu temples in  22 months

గత ఏడాది డిసెంబర్‌లో, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని తేరీ యూనియన్ కౌన్సిల్‌లో ఉన్న కృష్ణ ద్వార ఆలయంపై పాకిస్థాన్‌లోని ఛాందసవాదులు దాడి చేశారు. ఆలయానికి నిప్పంటించి, ఆయుధాలతో నేలమట్టం చేశారు. జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం పార్టీ (ఫజల్ ఉర్ రెహ్మాన్ గ్రూప్)కి చెందిన స్థానిక మతపెద్దలు, మద్దతుదారులు ఈ దాడిలో పాల్గొన్నారని భావిస్తున్నారు. జిల్లా పరిపాలన అధికారుల సమక్షంలోనే ఆలయాన్ని కూల్చివేశారని కూడా ఆరోపణలు వచ్చాయి.

పాకిస్థాన్ లోని 365 హిందూ దేవాలయాలలో, కేవలం 13 మాత్రమే పాకిస్తాన్‌లోని ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ (ఇటిపిబి) చూసుకుంటుంది 65 దేవాలయాల హిందూ సమాజం చూసుకుంటూ ఉండగా.. మిగిలిన 287 ఆలయాలకు ఎటువంటి రక్షణ లేకుండా పోయింది. భూ మాఫియా చేతుల్లో ఉంది.