More

    తలోగ్గిన శత్రు దేశం.. ఎట్టకేలకు భారత్ కు వస్తున్న పాక్ టీం..!

    భారతదేశంలో నిర్వహించబోయే వన్డే ప్రపంచ కప్ లో పాల్గొనేందుకు తమ క్రికెట్ జట్టును భారత్‌కు వెళ్లేందుకు అనుమతించాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్ట్ 6వ తేదీన అందుకు సంబంధించిన పత్రికా ప్రకటనను ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023లో పాల్గొనేందుకు తమ క్రికెట్ జట్టును భారత్‌కు పంపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టకూడదని తాము నిర్ణయించుకున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం తెలిపింది. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల స్థితి క్రీడలకు సంబంధించిన బాధ్యతలను నెరవేర్చడానికి అడ్డుగా ఉండకూడదని పాక్ విశ్వసిస్తోందని తెలిపారు.

    ఈ ఏడాది ఆసియా కప్‌ భారత్ లో జరగాల్సి ఉంది. అయితే ఆ టోర్నమెంట్ కు భారత జట్టును పాకిస్థాన్ కు పంపడానికి బీసీసీఐ ఒప్పుకోలేదు. హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తేనే వస్తామని భారత్ తేల్చి చెప్పింది. దీంతో పాక్ కు ఎలాంటి అవకాశం లేకపోవడంతో అందుకు ఓకే చెప్పాల్సి వచ్చింది. పాకిస్థాన్ కు భారత్ రాకపోతే.. తమ జట్టును భారత్ కు ప్రపంచ కప్ కోసం పంపించమని అన్నారు. కానీ ఐసీసీకి భారీ ఆదాయాన్ని అందిస్తున్న బీసీసీఐ కు నో చెప్తే ఏమవుతుందో పాక్ క్రికెట్ కు ఏమవుతుందో ఊహించుకోండంటూ కొందరు హెచ్చరించారు. దీంతో భారత్ కు పాక్ జట్టును పంపేందుకే పాకిస్థాన్ ఒప్పుకోవాల్సి వచ్చింది. క్రీడలను రాజకీయాలతో కలపకూడదని పాకిస్థాన్ గట్టిగా నమ్ముతోందని.. రాబోయే ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023లో పాల్గొనేందుకు తమ క్రికెట్ జట్టును భారత్‌కు పంపాలని నిర్ణయించిందన్నారు. అంతర్జాతీయ క్రీడలకు సంబంధించిన బాధ్యతలను నెరవేర్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలకు రాజకీయాలు అడ్డు పడకూడదని పాకిస్థాన్ విశ్వసిస్తోందంటూ పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. భారత్‌లో తమ క్రికెట్ జట్టు భద్రతపై తమకు తీవ్ర ఆందోళనలు ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాము ఈ అంశాలపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్, భారత అధికారులకు తెలియజేశామని పాకిస్థాన్ తెలిపింది. భారత పర్యటనలో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు పూర్తి భద్రత ఉంటుందని మేము ఆశిస్తున్నామని మంత్రిత్వ శాఖ తమ ప్రకటనలో తెలిపింది.

    ప్రపంచకప్‌కు జట్టును పంపడంపై నిర్ణయం తీసుకునేందుకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భుట్టోతో సహా చాలా మంది మంత్రులు జట్టును భారతదేశానికి పంపడానికి ఒప్పుకున్నారు. అక్టోబరు 14న వన్డే ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఆసియా కప్ లో భారత్‌ మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్థాన్‌కు రాకపోతే, తమ జట్టును కూడా భారత్‌కు పంపబోమని పాక్ గతంలో ప్రకటించింది. పాకిస్థాన్ మ్యాచ్‌లను శ్రీలంక లేదా బంగ్లాదేశ్‌లో నిర్వహించాలని కోరారు. అందుకు బీసీసీఐ ఒప్పుకోలేదు. పాకిస్థాన్ జట్టు హైదరాబాద్‌లో శ్రీలంక, నెదర్లాండ్స్‌తో.. బెంగళూరులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో, చెన్నైలో ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, కోల్‌కతాలో ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లతో మ్యాచ్ లు ఆడుతుంది.

    Related Stories