More

    పాకిస్తాన్ ఫర్ సేల్.. బేరమాడుతున్న సౌదీ రాజు..!

    అంతా అనుకుందే జరుగుతోంది. శత్రు దేశంలో పరిస్థితులు మరింత దిగజారాయి. ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి లేదు. పరిపాలన చేయలేని దుస్థితి నెలకొంది. చివరికి పాకిస్థాన్ ఫర్ సేల్ బోర్డు పెట్టేసింది. దీనితో ధనిక దేశాలు క్యూ కడుతున్నాయి. అందులో భాగంగానే భారత్ లో పర్యటనకు ముందు సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ పాకిస్తాన్ లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 10న ఇస్లామాబాద్ లో పర్యటిస్తారు. పాక్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ లతో సమావేశం కానున్నారు. పాక్ లో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో సౌదీ యువరాజు పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

    ఈ పర్యటన వెనక పెద్ద డీల్ ఉందని అక్కడి తాజా రాజకీయ పరిస్థితులు తెలిసిన వ్యక్తులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ లతో సౌదీ యువరాజు సమావేశం చర్చనీయాంశం అయింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం పాక్ ఆర్మీ చీఫ్ ను కలవడమే ప్రధాన లక్ష్యం అని అంటున్నారు. కేవలం ఆర్మీ చీఫ్ ఇమేజ్ ని బలోపేతం చేయడం కోసమే సౌదీ యువరాజు పర్యటన లక్ష్యమని అంటున్నారు. ఎందుకంటే అతడు తెర వెనక పాత్రధారి. ప్రభుత్వం ఎన్నికయ్యే వరకు కేర్ టేకర్ అని అంటున్నారు.

    తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో పాక్ ను సందర్శించడానికి ఎటువంటి కారణం లేనప్పటికీ పెట్టుబడులకు ఏవైనా మార్గాలు కోసం కారణం అయి ఉండొచ్చని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ‘పెట్టుబడుల కోసం ఒక మార్గం అయినా.. పాకిస్తాన్ అమ్మకానికి ఉంది. సౌదీ అరేబియా కొనుగోలుదారుల్లో ఒకటి.. సౌదీ యువరాజు పర్యటన దీనికి మార్గం వేస్తోందని అంటున్నారు అక్కడి తాజా రాజకీయ పరిస్థితులు తెలిసిన వ్యక్తులు. అదే జరిగితే పాకిస్తాన్ పాలన సౌదీ చేతికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు పాక్ ప్రజల జీవితాలను సౌదీ రాజు శాషించనున్నారు.

    అయితే రోజు రోజుకు దిగజారుతున్న పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ గురించి యావత్‌ ప్రపంచానికీ తెలుసు. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాక్‌ తరచూ ఇతర దేశాల ఆర్థికసాయం కోసం చేతులు జాస్తోంది. పాక్‌కు భారీగా ఆర్థిక సాయం అందిస్తున్న దేశాల్లో సౌదీ అరబ్‌ పేరు ముందుగా వినిపిస్తుంది. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఈ నెల రెండో వారంలో పాకిస్తాన్‌లో పర్యటించనున్నారు. మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పర్యటన ఇస్లామాబాద్‌లో స్వల్ప సమయం మాత్రమే ఉంటుందని, నాలుగు నుంచి ఆరు గంటలకు మించి ఉండదని ఆయన సన్నిహితులు తెలిపారు.

    సెప్టెంబరు 10న ఇస్లామాబాద్‌లో పర్యటన ముగించిన అనంతరం ఆయన తన భారత పర్యటనను ప్రారంభిస్తారు. కాగా న్యూ ఢిల్లీకి వెళ్లేముందు ప్రిన్స్‌ ఇస్లామాబాద్‌కు వెళ్లడంలో ప్రత్యేకత ఏమిలేదని, ఇది ఆయన పాటిస్తున్న సమభావన చర్య అని సన్నిహితులు అంటున్నారు. అయితే ప్రస్తుతం పాకిస్థాన్ రాజకీయాలు సైన్యం కనుసన్నల్లోకి వచ్చాయి. పాకిస్థాన్ ఆవిర్భావం నుంచి మూడుసార్లు ప్రజా ప్రభుత్వాలను కూల్చిన సైన్యం.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరించింది. ప్రజా నాయకులు ఎప్పుడు వచ్చినా వారిని నిలదోక్కుకుండా అస్థిరత సృష్టించటం పాక్ సైన్యానికి వెన్నతో పెట్టిన విద్య.

    ఆర్థికంగా ఇబ్బందుల్లో పాకిస్థాన్ లో రాబోయే ప్రభుత్వానికి నిత్యావసరాల ధరలు, ఉగ్రదాడుల్ని అదుపు చేయటం కత్తి మీద సామే. మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్, బాల్టిస్తాన్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల లేమి ఆ ప్రాంత ప్రజల్లో తిరుగుబాటుకు ఉసిగోల్పుతోంది. రాబోయే ఎన్నికల్లో సైన్యానికి ఎవరు వత్తాసు పలికితే వారికే అధికార పగ్గాలు దక్కుతాయనటంలో సందేహం లేదు. పాకిస్తాన్‌ ముస్లిం లీగ్ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్ నాటకీయ రాజకీయ పరిణామాల తర్వాత దేశ ప్రధాని అయ్యారు. అంతకు ముందు ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఇమ్రాన్ ఖాన్‌కు ముందు, అవిశ్వాస తీర్మానం కారణంగా ఏ పాకిస్తాన్ ప్రధాని కూడా పదవి నుంచి దిగిపోయిన పరిస్థితి రాలేదు. ఇమ్రాన్ ప్రభుత్వ పతనం తర్వాత, పాకిస్తాన్ రాజకీయాల్లో సైన్యం పాత్రపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. కేవలం సైన్యం కారణంగానే ఇమ్రాన్‌ ఖాన్‌ పదవి పోయిందని పాకిస్తాన్‌లో ప్రచారం జరిగింది. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

    అయితే, గత కొద్దిరోజులుగా పాకిస్తాన్‌ రాజకీయాలో ఏం జరిగినా, సైన్యం ప్రస్తావన వచ్చినా, తాము ఈ పరిణామాలకు దూరంగా ఉన్నామని చెప్పుకోవడంలో సైన్యం సఫలీకృతమైనట్లు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్‌ రాజకీయాల్లో సైన్యం ప్రభావం మరోసారి స్పష్టంగా కనపడుతోంది. వాస్తవానికి ఇప్పుడు మాత్రమే కాదు, పాకిస్తాన్‌ రాజకీయాల్లో ఎలాంటి మార్పు వచ్చినా అందులో సైన్యం పాత్ర అనివార్యంగా మారింది. నిజానికి 1947లో పాకిస్తాన్ కొత్త దేశంగా ఆవిర్భవించినప్పుడు, అధికారం రాజకీయ నాయకత్వం చేతిలో ఉంది. అయితే కొద్ది కాలంలోనే దేశ రాజకీయాల్లోకి సైన్యం ప్రవేశించింది. పాకిస్తాన్‌లో ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా తనతో రాజీ పడకుండా మనుగడ సాగించలేనంతగా సైన్యం బలంగా మారింది. ఇప్పటి వరకు పాకిస్తాన్‌లో ఏ ప్రధాని కూడా ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేయలేదు.

    పాకిస్తాన్‌లో మొదటి సైనిక తిరుగుబాటు 1956లో జనరల్ అయూబ్ ఖాన్ నేతృత్వంలో జరిగింది. అంతకుముందు, దేశ పాలనను నడపడానికి సైన్యం, రాజకీయ నాయకుల సంకీర్ణ వ్యవస్థ ఏర్పడింది. రాజకీయ నేతల చేతకానితనం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. మొదటి సైనిక తిరుగుబాటు తర్వాత, సైన్యం బ్యారక్‌లకు తిరిగి రాలేదు. దేశాన్ని నడిపించే బాధ్యత రాజకీయ నాయకత్వానికి తిరిగి వచ్చింది. కానీ సైన్యం అధికారంలో ఉంది. 65 ఏళ్ల పాకిస్తాన్ చరిత్రలో సైన్యం 33 ఏళ్లు పాలించింది. సైన్యం అధికారంలో లేనప్పుడు కూడా, అది అన్ని వ్యవస్థల పైనా ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ కారణంగానే సైన్యం దేశ భద్రత అనే అస్త్రాన్ని ఉపయోగించింది. పాకిస్తాన్ ఒక దేశంగా ఆవిర్భవించినప్పుడు భారత దేశంతో యుద్ధానికి దిగినందున, దేశ భద్రత అనే సమస్యను చూపించడం సైన్యానికి సులభం అయింది. పాకిస్తాన్ ఖర్చులో మూడింట ఒక వంతు సైన్యం ద్వారా నడుస్తుంది. సైన్యం అనేక రకాల వ్యాపారాలలో నిమగ్నమై ఉంది. వ్యవసాయం, పారిశ్రామిక ఉత్పత్తిలో కూడా సైన్యం పాత్ర ఉంది.

    అలాగే పాకిస్తాన్ సైన్యానికి దాని విదేశాంగ విధానంతో చాలా సన్నిహిత సంబంధం ఉంది. పాకిస్తాన్ ‌కు ఒక దేశం శత్రువా, మిత్రుడా అన్నది ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ మాత్రమే నిర్ణయిస్తుందని అంటారు. పాకిస్తాన్ సైన్యం కూడా బయటి ప్రపంచంతో తమకున్న సంబంధాల గురించి బహిరంగంగానే చెబుతుంది. యుక్రెయిన్‌ పై రష్యా దాడికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా మద్దతు ఇవ్వలేదు. అయితే, ఆ సమయంలో రష్యాకు వచ్చిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ యుద్ధం పై తాను వ్యాఖ్యానించదలుచుకోలేదని చెప్పారు. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ సైన్యంలోని ఉన్నతాధికారులు విదేశాంగ విధానంపై సైన్యం ప్రభావాన్ని సమర్థించుకుంటారు. కానీ, పాకిస్తానీ సమాజం సైన్యం హక్కులను ప్రశ్నించినట్లు ఎప్పుడూ వినలేదు. రాజకీయాల్లో సైన్యం జోక్యం చేసుకునే పద్ధతులు కూడా మారాయి. ఇటీవల పాక్‌లో రాజకీయ దుమారం రేగుతున్న వేళ..ఇమ్రాన్‌ ఖాన్‌తో దూరం పాటిస్తూనే..ఆయనకు మద్దతుగాలేమని ఆర్మీ సందేశం ఇచ్చింది. ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో సౌదీ రాజు ఆర్మీ చీఫ్ తో చర్చలు జరుపనున్నారు.

    Trending Stories

    Related Stories