More

    షియా ముస్లిం కారణంగానే మ్యాచ్ ఓడిపోయామంటూ ఆ ఆటగాడిపై తీవ్ర విమర్శలు

    టీ20 ప్రపంచ కప్ 2021 సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ జట్టు ఓడిపోయింది. అయితే ఫాస్ట్ బౌలర్ హసన్ అలీని పాకిస్తానీ క్రికెట్ అభిమానులు అత్యంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.. అతడి కుటుంబ సభ్యులపై కూడా తీవ్రమైన పదజాలంతో దూషిస్తూ ఉన్నారు.

    హసన్ అలీ బౌలింగ్ లో బాగా కొట్టించుకోగా.. ఆ తర్వాత అతడు వదిలేసిన క్యాచ్ తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. క్యాచ్ డ్రాప్ తో బతికిపోయిన మాథ్యూ వేడ్ షాహీన్ అఫ్రిదీ బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్స్ లు బాది ఆసీస్ కు విజయాన్ని అందించాడు. దీంతో పాక్ వరల్డ్ కప్ రేస్ నుండి నిష్క్రమించింది. హసన్ అలీ 4 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చాడు, ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ అతడి బౌలింగ్ లో 4 ఫోర్లు మరియు 1 సిక్స్‌తో కొట్టింది. ఓవర్‌కు 11 ఎకానమీ రేటు ఉన్నప్పటికీ అతను వికెట్లు పడగొట్టడంలో విఫలమయ్యాడు. ఆస్ట్రేలియాకు గేమ్‌చేంజర్‌గా నిరూపించుకున్న మాథ్యూ వేడ్ క్యాచ్‌ను వదిలివేసిన తర్వాత అతడు ఒక్కసారిగా విలన్ అయిపోయాడు. హసన్ అలీని కెప్టెన్ బాబర్ ఆజం కూడా మందలించాడు.

    హసన్ అలీపై దూషణలు:

    పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు హసన్ అలీని దూషించడం మొదలుపెట్టారు. అతని కుటుంబానికి వ్యతిరేకంగా నీచంగా దుర్భాషలాడారు. ”మాథ్యూ వేడ్‌ క్యాచ్‌ను వదులుకోవడం మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌. అది పట్టి ఉండి ఉంటే బహుశా భిన్నమైన ఫలితం వచ్చి ఉండొచ్చు. ఒక ఆటగాడిగా అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ” అని పాక్ కెప్టెన్ బాబర్ ఆజం వ్యాఖ్యానించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం వ్యక్తిగత విమర్శలు, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల నుండి హసన్ అలీకి ఎక్కువయ్యాయి. అతడి తల్లి మరియు భార్య గురించి అవమానకరమైన వ్యాఖ్యలను చేశారు. ఎంతో మంది తీవ్రంగా బూతులు తిట్టారు. సోషల్ మీడియాలో హసన్ అలీని ఎంతగానో విమర్శించారు. ఇక ఇంకొందరు హసన్ అలీ షియా ముస్లిం అంటూ అతడిపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అతడి కారణంగానే మ్యాచ్ ఓడిపోయిందంటూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.

    పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మ్యాచ్ అనంతరం తమ క్రికెట్ జట్టుకు ప్రత్యేక సందేశం పంపారు. “నేను క్రికెటర్ గా ఉన్నప్పుడు ఇలాంటి తీవ్ర నిరాశామయ పరిస్థితులను మైదానంలో ఎన్నో ఎదుర్కొన్నాను. ఇప్పుడు మీరు ఎలాంటి వేదనాభరిత పరిస్థితుల్లో ఉన్నారో అర్థం చేసుకోగలను. అయితే ఈ టోర్నీలో మీరు ప్రదర్శించిన నాణ్యమైన క్రికెట్ పట్ల గర్వించాలి. విజయాల పట్ల మీరు పొంగిపోకుండా ఒదిగి ఉన్న తీరు అభినందనీయం” అని చెప్పుకొచ్చారు.

    Trending Stories

    Related Stories