More

    సెమీఫైనల్ కు అర్హత సాధించిన పాకిస్థాన్

    పాకిస్థాన్ సెమీఫైనల్ కు అర్హత సాధించింది. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఊహించని విధంగా దక్షిణాఫ్రికా ఓటమి పాలవడంతో భారత్ సెమీస్ కు అర్హత సాధించేసింది. ఆ తర్వాత జరిగిన పాకిస్థాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ లో విజేతకు సెమీస్ అవకాశాలు ఉండగా.. పాకిస్థాన్ బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. 5 వికెట్ల తేడాతో పాక్ విజయాన్ని అందుకుంది.

    కీలక మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బంగ్లా.. 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. అనంతరం 128 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన పాక్.. 18.1 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 127/8 స్కోరుకే పరిమితం అయింది. ఓపెనర్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (48 బంతుల్లో 7 ఫోర్లతో 54) అర్ధ సెంచరీతో సత్తా చాటాడు. మరో ఓపెనర్ లిటన్ దాస్ (10) నిరాశ పరిచినా వన్ డౌన్ లో వచ్చిన సౌమ్యా సర్కార్ (20)తో కలిసి శాంటో రెండో వికెట్ కు 52 పరుగులు జోడించి మంచి ఆరంభం ఇచ్చాడు. 10 ఓవర్లకు బంగ్లా 70/1తో నిలిచి మంచి స్కోరు చేసేలా కనిపించింది. ఆ తర్వాత శాంటో, సౌమ్యా సర్కార్ తో పాటు షకీబ్ అల్ హసన్ (0), మొసాదెక్ హొస్సేన్ (5), నురుల్ హసన్ (0), తస్కిన్ అహ్మద్ (1), నసుమ్ అహ్మద్ (7) పెవిలియన్ చేరారు. చివర్లో అఫిఫ్ హొస్సేన్ (24 నాటౌట్) కీలక పరుగులు చేసి బంగ్లాకు గౌరవప్రద స్కోరు అందించాడు. పాక్ బౌలర్లలో యువ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది నాలుగు వికెట్లు తీయగా.. షాదాబ్ ఖాన్ రెండు, ఇఫ్తికార్ అహ్మద్, హారిస్ రవూఫ్ చెరో వికెట్ పడగొట్టారు.

    Trending Stories

    Related Stories