More

    వామ్మో.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భారత్ ను బెదిరిస్తోంది

    భారతజట్టు పాకిస్థాన్ లో నిర్వహించే ఆసియా కప్ టోర్నమెంట్ లో పాల్గొనబోదని బీసీసీఐ తాజాగా తేల్చి చెప్పేసింది. ఇక పాకిస్థాన్ కు గత్యంతరం లేక తటస్థ వేదికల్లో టోర్నమెంట్ ను నిర్వహించాల్సి ఉంటుంది. 2023 ఆసియా కప్ హోస్టింగ్ హక్కులు పాకిస్తాన్‌కు ఇచ్చారు, అయితే ఆ టోర్నమెంట్ లో పాల్గొనడం కోసం భారత జట్టు పాక్ కు వెళ్లదని బీసీసీఐ స్పష్టం చేసింది. పాకిస్థాన్ లో తమకు సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఉన్నాయని భారత్ ఒక్క స్టేట్మెంట్ ఇస్తే చాలు.. భారత్ కు వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. భారత్ మీద పాక్ చేస్తున్న కుట్రలను దృష్టిలో ఉంచుకుని భారత్ పాక్ కు వెళ్లకుండా ఆగిపోతోంది. ఇక ఆసియా కప్‌ను ఇప్పుడు మరెక్కడైనా నిర్వహించాల్సి ఉంటుందని బీసీసీఐ సెక్రటరీ జే షా తెలిపారు. పాకిస్తాన్‌తో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లు లేదా పాకిస్థాన్ లో పర్యటించడం చాలా సమస్యాత్మకం.. అక్కడకు వెళ్లడానికి ముందు BCCI కు ప్రభుత్వ అనుమతి అవసరం ఉంటుందని అన్నారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడిగా ఉన్న జై షా మాట్లాడుతూ ఆసియా కప్-2023 తటస్థ వేదికలో నిర్వహిస్తామని అన్నారు. భారత జట్టు పాకిస్థాన్ కు వెళ్లలేదని.. వారు ఇక్కడికి రాలేరని జై షా వెల్లడించాడు. గతంలో కూడా ఆసియా కప్ తటస్థ వేదికలో జరిగిందని షా చెప్పుకొచ్చారు.

    జై షా ప్రకటనపై పీసీబీ ఆందోళన వ్యక్తం చేసింది. “వచ్చే ఏడాది ఆసియా కప్‌ను తటస్థ వేదికగా మార్చడంపై ఎసిసి ప్రెసిడెంట్ జై షా చేసిన వ్యాఖ్యలపై పీసీబీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ బోర్డ్ లేదా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (ఈవెంట్ హోస్ట్)తో ఎలాంటి చర్చలు, సంప్రదింపులు లేకుండా వ్యాఖ్యలు చేశారు. ACC ఆసియా కప్‌ను మార్చడంపై జై షా ప్రకటన స్పష్టంగా ఏకపక్షంగా తీసుకోబడింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ స్ఫూర్తికి విరుద్ధం.” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లేఖలో పీసీబీ చెప్పుకొచ్చింది.

    2023లో జరిగే ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో జరుగనుంది. అంతకుముందు ఆసియా కప్‌ 2023 కోసం పాకిస్థాన్‌కు టీమిండియాను పంపించడానికి బీసీసీఐ సుముఖంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని జేషా ఖండించారు. 2023 ఆసియా కప్‌ పాకిస్థాన్‌లో జరగనుండగా.. ఆ తర్వాత వన్డే వరల్డ్‌కప్‌ ఇండియాలో జరగనుంది. ఇప్పుడు పాకిస్థాన్ మీరు ఆసియా కప్ కోసం పాకిస్థాన్ కు రాకపోతే.. వన్డే వరల్డ్ కప్ కోసం భారత్ కు రామని చెబుతూ ఉంది. ఆసియా కప్‌2023కు భారత్ జట్టును పంపకపోతే, తదుపరి వన్డే ప్రపంచకప్‌కు మా జట్టును భారత్‌కు పంపబోమని పీసీబీ బెదిరిస్తోంది. జులై-ఆగస్టులో ఆసియా కప్, అక్టోబర్-నవంబర్‌లో ప్రపంచకప్ జరగాల్సి ఉంది. వచ్చే నెలలో మెల్‌బోర్న్‌లో జరగనున్న ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించనున్నట్లు పీసీబీ అధికార ప్రతినిధి తెలిపారు.

    Trending Stories

    Related Stories