భారత్ టార్గెట్‎గా పాక్ సైబర్ ఆర్మీ..! ఏం ప్లాన్ చేశారో తెలుసా..?

0
727

శుక్రాచార్య గణానికి వక్రబుద్ధులు, వంకర చేష్టలు తప్ప మంచి, మానవత్వ మర్యాదలు ఏం తెలుస్తాయి. ఇది రాక్షస గురువు శుక్రాచార్యుడు, అసురగణాలకు చెందిన వ్యాఖ్య అయినా.. కుక్క తోక వంకర దేశానికి సరిగ్గా వర్తిస్తుంది. గురువు టర్కీ సాయంతో పాక్ శిష్యుడు.. భారత్ కు వ్యతిరేకంగా సైబర్ ఆర్మీని సృష్టించుకున్నాడట. ఆగ్నేయ ఆసియాను లక్ష్యంగా చేసుకుని ఈ నిర్వాకానికి తెర లేపాడట.

పాక్ దేశీయ రాజకీయ సంకుచిత లక్ష్యాల కోసం టర్కీ, పాకిస్థాన్ రహస్య మంతనాలు సాగించాయి. సింహం లాంటి భారత్ ఎదుట ధైర్యంగా నిలబడే ధైర్యం లేక.. పాక్ కుక్కలు, టర్కీ నక్కలు కలిసి.. సీక్రెట్‎గా సైబర్ సైన్యం ఏర్పాటు చేసుకున్నాయి. దీనికి, దిక్కుమాలిన ద్వైపాక్షిక ఒప్పందం ఒకటి. భారత దేశం, అమెరికాపై దాడులు చేయడానికి, పాక్ పాలకుల పాపపు పనులపై చేసే విమర్శలను అణగదొక్కడమే ఈ సైబర్ సైన్యం ప్రధాన ఉద్దేశమని సమాచారం. దీనికి లోపయికారీగా టర్కీ, పాకిస్తాన్‎కు సాయం అందించి పైశాచిక ఆనందం పొందింది. సైబర్-ఆర్మీ ఏర్పాటులో.. టర్కీ పాకిస్తాన్‌కు సాయం చేసిందనే విషయాన్ని నార్డిక్ మానిటర్ అనే ఎన్జీవో సంస్థ పసికట్టింది.

2018 డిసెంబరు 17 న టర్కీ అంతర్గత మంత్రి సులేమాన్ సోయ్లు, అప్పటి పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి షెహ్ర్యార్ ఖాన్ అఫ్రిది మధ్య జరిగిన ప్రైవేట్ చర్చల్లో ఈ యూనిట్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తొలిసారిగా చర్చకు వచ్చినట్టు వెల్లడైంది. అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ ఆపరేషన్ కు ఇమ్రాన్ వ్యక్తిగతంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఇస్లామాబాద్ అంతర్గత మంత్రిత్వ శాఖ దీనిని గోప్యంగా వుంచింది. పాక్ కు సాయం చేయడానికి టర్కీ అంగీకరించాక, ఆపరేషన్ నిపుణలను పాక్ కు పంపిందని, ఈ వ్యక్తులు సెక్యూరిటీ జనరల్ డైరెక్టరేట్‌లోని వివిధ విభాగాలకు చెందినవారని తెలిసింది. ఈ దుష్టగ్యాంగ్ నెలల తరబడి పాక్ లో వుండి ఈ ఆపరేషన్ ఏర్పాటుకు సహకరించారని వెల్లడైంది. టర్కీ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి దాదాపు ఆరు వేల మంది పాకిస్థానీ అధికారులు ఈ ఆపరేషన్ కు సంబంధించి శిక్షణ పొందినట్టు తెలిసింది.

2022 అక్టోబర్ 13న కహ్రామన్‌మరాస్‌ స్థానిక టీవీ స్టేషన్‌ ఇంటర్వ్యూలో సోయ్లు ఈ రహస్య ఆపరేషన్‌ను తొలిసారి బహిరంగంగా అంగీకరించారు. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తరఫున సైబర్‌స్పేస్‌లో ట్రోల్, బోట్ ఆర్మీలను నడపడంలో సోయ్లు పేరు పొందాడు. సెప్టెంబర్ 2016లో అంతర్గత మంత్రిగా మారడానికి ముందు సైతం ఇలాంటి రహస్య కార్యకలాపాలలో పనిచేసినట్టు వెల్లడైంది.

ఇస్లామిజం ఇప్పటికే చొరబడి, ఇస్లామిస్ట్ అంశాలు ఈ ప్రాంతంలో ఆశ్రయం పొందడంతో ఇస్లామిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్థాన్ SE ఆసియాను ఎంచుకుందని తెలుస్తోంది. రాడికల్ ఇస్లామిక్ బోధకుడు జాకీర్ నాయక్ భారతీయ అధికారుల నుంచి తప్పించుకుని మలేషియాలో శాశ్వత నివాస హోదా పొందుతున్నాడు. ఈ తరహా ఘటనలతో SE ఆసియా ప్రాంతంలో భారత వ్యతిరేక, హైందవ జాతి వ్యతిరేక భావాలకు దుష్టగ్యాంగ్‎లు బీజాలు నాటుతున్నాయి.

ఆగ్నేయాసియాను టార్గెట్ చేసుకుని టర్కీ, పాక్ సైకో గ్యాంగ్ సైబర్ నేరాలకు దిగి భారత్‎కు కలత కల్గించాలని ప్రయత్నాలు సాగించింది. రహస్య ప్రభావ కార్యకలాపాలు కేవలం భారత్ వైపు మాత్రమే కాకుండా US వైపు లక్ష్యనిర్దేశం చేసుకున్నాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

4 + 14 =