More

  భారత్ మా మీదకు మిసైల్ దాడి చేసిందని ఆరోపిస్తున్న పాకిస్థాన్

  భారతదేశానికి చెందిన సూపర్‌సోనిక్ క్షిపణి పాకిస్థాన్ మీదకు వచ్చిందని వారు ఆరోపిస్తూ వస్తున్నారు. బుధవారం సాయంత్రం సిర్సా నుంచి టేకాఫ్ అయ్యిందని, పాకిస్థాన్ భూభాగంలోని 124 కి.మీ దూరంలో ఉన్న ప్రదేశంలో బుధవారం సాయంత్రం అది ల్యాండ్ అయిందని పాకిస్థాన్ గురువారం పేర్కొంది. ఈ క్షిపణి 40,000 అడుగుల ఎత్తులో దూసుకువచ్చిందని.. ఇలాంటి మిసైల్స్ ద్వారా భారత, పాకిస్థాన్ దేశాల గగనతలంలో ప్రయాణీకుల విమానాలు, భూమిపై ఉన్న పౌరులు, ఆస్తులు కూడా ప్రమాదంలో పడతాయని పేర్కొంది. పాకిస్థాన్ వాదనపై భారత వైమానిక దళం లేదా రక్షణ మంత్రిత్వ శాఖ నుండి ఎటువంటి స్పందన లేదు.

  గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో, పాకిస్థాన్ సాయుధ దళాల ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) డైరెక్టర్ జనరల్, మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తికార్ మాట్లాడుతూ “భారత్ ఫ్లైయింగ్ స్పేస్ నుండి ఒక హై-స్పీడ్ వస్తువు గాల్లోకి వచ్చింది. పాకిస్థాన్ వైమానిక దళం ఎయిర్ డిఫెన్స్ ఆపరేషన్స్ సెంటర్ చూస్తూ ఉండగా.. దాని ప్రారంభ మార్గం నుండి ఆ వస్తువు అకస్మాత్తుగా పాకిస్థాన్ భూభాగం వైపుకు దూసుకెళ్లింది. పాకిస్థాన్ గగనతలం లోకి వచ్చి, చివరికి మియా చన్ను సమీపంలో పడిపోయింది.” అని అన్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఒక గోడ పడిపోయిందని పాకిస్థాన్ మిలిటరీ తెలిపింది.

  బాలిస్టిక్ క్షిపణుల విమాన పరీక్షకు సంబంధించిన ముందస్తు నోటిఫికేషన్‌పై భారతదేశం, పాకిస్తాన్ మధ్య 2005 నాటి ఒప్పందం ప్రకారం.. ప్రతి దేశం ఇలాంటి పరీక్షల సమయంలో కనీసం మూడు రోజుల ముందుగా ఇతర దేశాలకు తెలియజేయాలి. ప్రయోగ కేంద్రాలు అంతర్జాతీయ సరిహద్దు లేదా నియంత్రణ రేఖ నుండి 40 కి.మీ పరిధిలోకి రాకూడదని, ప్రణాళికాబద్ధమైన ప్రభావ ప్రాంతం 75 కి.మీ పరిధిలోకి రాకూడదని ఒప్పందంలో ఉంది.

  పాకిస్థానీ వైమానిక దళం, మేజర్ జనరల్ ఇఫ్తికార్ మాట్లాడుతూ, ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలకు అనుగుణంగా అవసరమైన వ్యూహాత్మక చర్యలను ప్రారంభించిందని అన్నారు. “ఈ సంఘటన జరగడానికి కారణమేదైనా, భారత్ నుండి మాకు వివరణ కావాలి,” అని జనరల్ ఇఫ్తికార్ చెప్పాడు. పాకిస్తాన్ ఈ ఘోరమైన ఉల్లంఘనను తీవ్రంగా నిరసిస్తోంది. భవిష్యత్తులో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా హెచ్చరిస్తోందని అతను చెప్పాడు.

  పాకిస్తాన్ వైమానిక దళం ప్రతినిధి తారిక్ జియా మాట్లాడుతూ ఆ వస్తువు 40,000 అడుగుల ఎత్తులో దూసుకువచ్చింది. పాకిస్థాన్‌లో ప్రయాణించిన మొత్తం దూరం 124 కి.మీ అని, భూమిని ఢీకొనే వరకు మొత్తం విమాన 6 నిమిషాల 46 సెకన్ల పాటూ ఎగిరింది, అది 3 నిమిషాల 44 సెకన్ల పాటు పాకిస్థాన్ భూభాగంలో ఉందని ఆయన చెప్పారు. తాము శిధిలాలను పరిశీలించగా.. ఇది సూపర్‌సోనిక్ క్షిపణి అని, అన్ ఆర్మ్డ్ మిసైల్ గా మేము ఇప్పటివరకు అంచనా వేయగలము. ఇంకా వివరాలు రావాల్సి ఉంది అని తారిక్ జియా అన్నారు.

  Trending Stories

  Related Stories