International

పాకిస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం

క్వెట్టా, పాకిస్థాన్‌: పాకిస్థాన్‌లోని పశ్చిమ ప్రాంతంలో బస్సు లోయలో పడిపోవడంతో 19 మంది మరణించగా, 14 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. బస్సు రావల్పిండి నుండి క్వెట్టాకు వెళుతుండగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని డానిసర్ సమీపంలో బస్సు లోయలోకి పడిపోయిందని స్థానిక అధికారి ఎజాజ్ జాఫర్ AFP కి తెలిపారు.

ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోగా మరో 11 మంది గాయాలపాలయ్యారు. క్వెట్టా నుంచి ఇస్లామాబాద్‌కు 30 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు..జోబ్‌లోని లోయలో పడిపోయింది. భారీ వర్షం కురుస్తుండటంతో మలుపు వద్ద బస్సుపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయి ఘోరం సంభవించిందని అధికారులు తెలిపారు. రోడ్ల నిర్వహణ సరిగా లేకపోవడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ మూలంగా పాకిస్తాన్‌లో ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయని ప్రజలు చెబుతూ ఉన్నారు. రోడ్లను బాగు చేయాలని ఎప్పటి నుండో డిమాండ్ చేస్తూ ఉన్నారు. పాక్ ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు.

Related Articles

Back to top button