InternationalNational

భారత్ కు వ్యతిరేకంగా విష ప్రచారానికి ప్రత్యేకంగా పిఆర్ టీమ్.. షాక్ ఇచ్చిన ఫేస్ బుక్

భారత్ కు వ్యతిరేకంగా ఎన్నో అదృశ్య శక్తులు విష ప్రచారాన్ని చేస్తూ ఉన్నాయి. ఇది ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. భారత్ లో అల్లర్లను సృష్టించాలని చేస్తున్న ప్రయత్నాలు కొత్తేమీ కాదు. భారత్-వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రచారం చేయడానికి సోషల్ మీడియాను ఇంకో మార్గంగా ఎంచుకుంది పాక్. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో పోస్టులు, భారత్ లో పరిస్థితులు ఎంతో దారుణంగా ఉన్నాయంటూ వార్తలను సృష్టిస్తూనే ఉంది. ఫేస్ బుక్ లో పెద్ద ఎత్తున భారత-వ్యతిరేక ద్వేషపూరిత ప్రచారం మొదలుపెట్టింది పాక్. ఈ వ్యతిరేక ప్రచారాన్ని గుర్తించిన ఫేస్ బుక్ సంస్థకు చెందిన ‘కో-ఆర్డినేటెడ్ అనాథెటిక్ బిహేవియర్ (సిఐబి)’ పెద్ద ఎత్తున పాక్ కు చెందిన కొన్ని పేజీలను, విద్వేష ప్రచారాన్ని తొలగించేసింది. మే 2020 లో భారత్ ను లక్ష్యంగా చేసుకొని ప్రచారం చేస్తున్న నెట్‌వర్క్‌లను తొలగించింది.

పాకిస్తాన్ కు చెందిన పిఆర్ సంస్థ ఆల్ఫాప్రోతో సంబంధం ఉన్న పేజీలు అంతర్జాతీయ వార్తా సంస్థలుగా చెలామణీ అవుతూ అనేక భారత వ్యతిరేక పోస్టులను పోస్ట్ చేశాయి. భారతదేశంలో కోవిడ్ నిర్వహణ తప్పుబట్టడమే కాకుండా, ముస్లింలు, కాశ్మీర్, పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలను చేయడాన్ని గుర్తించారు. ఆల్ఫా ప్రో యొక్క వెబ్‌సైట్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ప్రకారం, పాకిస్తాన్ ఆర్మీ తన ఖాతాదారులలో ఒకరిగా జాబితాలో ఉంచారు. దీన్ని బట్టి పాకిస్థాన్ ఆడుతున్న నాటకంగా స్పష్టమవుతోంది.

బయటపడ్డ నిజాలు: భారత వ్యతిరేక పోస్టులను షేర్ చేసే పిఆర్ సంస్థతో పాకిస్తాన్ సైన్యం సంబంధాలు

పాకిస్తాన్‌లో పుట్టుకొచ్చిన 40 ఫేస్‌బుక్ ఖాతాలు, 25 ప్రత్యేకమైన పేజీలు, ఆరు గ్రూపులు, 28 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను తొలగించామని ఫేస్ బుక్ సంస్థ తెలిపింది. పాకిస్తాన్‌ ప్రజలను లక్ష్యంగా చేసుకున్నాము, ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్, అరబిక్, పాష్టో మాట్లాడే వారిపై ఈ పేజీలు, గ్రూపులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి భారత్ కు వ్యతిరేకంగా విషం జల్లే పనులు చేస్తూ వచ్చాయి. ఫేస్ బుక్ ఏప్రిల్ 2019 లో తొలగించిన నెట్‌వర్క్‌కు చెందిన కొన్ని లింక్‌లు అనుమానాస్పదంగా వ్యవహరించడాన్ని గమనించామని.. మా అంతర్గత దర్యాప్తులో కూడా ఈ విషయాలను తెలుసుకున్నామని ఫేస్ బుక్ కు చెందిన కో-ఆర్డినేటెడ్ అనాథెటిక్ బిహేవియర్ తెలిపింది. పాకిస్తాన్‌కు చెందిన పిఆర్ సంస్థ ఆల్ఫాప్రోతో వీరికి సంబంధం ఉందని బట్టబయలు అయింది.

ఈ పేజీలలో కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలుగా చెలామణీ అయ్యేవి. కొన్ని వీడియో కంటెంట్‌ లను తరచుగా పంచుకునేవి.. అలాగే భారత్ కు వ్యతిరేకంగా ఎప్పుడూ వార్తలను పోస్టు చేస్తూ ఉండేవి. చాలా యాక్టివ్ గా ఈ పేజీలు ఉండేవి. భారతదేశంపై విమర్శలు చేయడం.. ముస్లింల పట్ల భారత్ లో దారుణాలు జరుగుతున్నాయంటూ అసత్య వ్యాఖ్యలు చేయడం.. ఇక కాశ్మీర్ ప్రాంతం గురించి అబద్ధాలు చెప్పడం.. పాకిస్తాన్ కు వత్తాసు పలుకుతూ పోస్టులు పెట్టడం వంటివి ఈ పేజీల్లో ఉండేవి. వీటిని గుర్తించిన ఫేస్ బుక్ బ్లాక్ చేసేసింది. 40 ఖాతాలు, 25 పేజీలు, 6 గ్రూపులలు, 28,000 మంది ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు 800,000 మంది ఫాలోవర్లు ఉన్నట్లు గుర్తించారు. 40,000 డాలర్లను యాడ్స్ కోసం ఉపయోగించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇదంతా పాకిస్తాన్ ఆర్మీ కనుసన్నల్లో జరిగిందని ఆధారాలు కూడా ఉన్నాయి.

ఆల్ఫా ప్రో సంస్థ గురించి:

ఆల్ఫా ప్రో పాకిస్తాన్ కు చెందిన పిఆర్ సంస్థ. ఇస్లామాబాద్ ప్రధాన కార్యాలయంగా ఉంది.. అలాగే పాకిస్తాన్ మొత్తం విస్తరించింది. ఈ సంస్థ వెబ్, వార్తాపత్రికలు, మ్యాగజైన్‌ల కోసం వీడియో, ఆడియో, వ్రాతపూర్వక కంటెంట్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా కార్పొరేట్ సెక్టార్ క్లయింట్లు, అభివృద్ధి రంగ ప్రాజెక్టుల కోసం ప్రచారాలను చేస్తూ ఉంటుంది. పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న అనేక చైనా సంస్థలు – జోంగ్, పవర్ చైనా హబ్, పోర్ట్ ఖాసిమ్ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్, పాకిస్తాన్ ఆర్మీ, సిటీ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ (రావల్పిండి), వాటర్ వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు వీరికి క్లయింట్లుగా ఉన్నారు.

ఆర్టికల్ 370, సిఎఎ, కాశ్మీర్, ఉగ్రవాదం, కోవిడ్ -19 నిర్వహణ వంటి వాటిపై పాకిస్తాన్ భారతదేశాన్ని విమర్శిస్తూ ఉండడమే కాకుండా విషం చిమ్ముతూనే ఉంది. ప్రస్తుతం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. మరో వైపు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బాజ్వా భారతదేశాన్ని ‘గతాన్ని పాతిపెట్టి ముందుకు సాగాలని’ పిలుపునిచ్చారు. ఇరుగు పొరుగు దేశాల మధ్య శాంతి దక్షిణ మరియు మధ్య ఆసియాకు మంచి చేకూరుతుందని అంటున్నారు. ఆర్టికల్ 370 పునరుద్ధరించబడే వరకు భారత్‌తో ఎలాంటి చర్చలు జరపలేమని ఇంతకు ముందు వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ మధ్య వెనక్కి తగ్గారు. భారత్ తో చర్చల కోసం తహతహలాడుతూ ఉన్నారు. మరో వైపు సామాజిక మాధ్యమాల ద్వారా విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

5 × 3 =

Back to top button