More

    ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 30 మంది మృతి

    ఏప్రిల్ 15.. శుక్రవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్‌లోని ఖోస్ట్ ప్రావిన్స్‌పై పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడులను ప్రారంభించిందని ఆఫ్ఘనిస్తాన్‌లోని స్థానిక అధికారులు ధృవీకరించారు. వైమానిక దాడిలో మహిళలు, పిల్లలతో సహా కనీసం 30 మంది మరణించారు. ఖోస్ట్ ప్రావిన్స్‌లోని స్పుర్రా జిల్లాలోని ప్రాంతాలను పాకిస్థాన్ విమానాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఖోస్ట్ ప్రావిన్స్‌లోని స్పురా జిల్లాలోని మిర్పర్, మండే, షైదీ, కై గ్రామాలను పాకిస్తాన్ విమానాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఖోస్ట్ ప్రావిన్స్‌లోని తాలిబాన్ పోలీసు చీఫ్ అధికార ప్రతినిధి మోస్టాగ్‌ఫర్ గెర్బ్జ్ దాడిని మీడియా సంస్థలతో ధృవీకరించారు.

    ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు సహా 30 మంది మరణించారని వజీరిస్థాన్ ప్రాంతంలోని ఓ తెగకు చెందిన జంషీద్ వార్తాపత్రికతో చెప్పారు. బాంబు దాడిలో జరిగిన ప్రాణనష్టం గురించి తనకు తెలియదని గెర్బ్జ్ చెప్పారు. శుక్రవారం ఉదయం 9:00 గంటలకు, గోర్బ్జ్ జిల్లాలోని మాస్టర్‌బెల్ ప్రాంతంలో పాకిస్థాన్ సైనికులు తాలిబాన్ దళాలతో ఘర్షణ పడ్డారు.

    TOLO న్యూస్ సంస్థ ఆఫ్ఘనిస్తాన్‌లోని తూర్పు కునార్, ఆగ్నేయ ఖోస్ట్ ప్రావిన్స్‌లలోని రెండు ప్రాంతాలలో శుక్రవారం రాత్రి పాకిస్థాన్ దళాలు వైమానిక దాడులు చేసినట్లు తెలిపింది. అనేక మంది ప్రత్యక్ష సాక్షులు కూడా దాడుల గురించి తెలిపారు. ఉత్తర వజీరిస్థాన్‌పై పాక్ చేసిన వైమానిక దాడుల్లో పలువురు పాక్ వ్యతిరేక ఉగ్రవాదులు హతమైనట్లు పాక్ మీడియా చెబుతోంది. అయితే ఈ విషయంపై పాక్ ప్రభుత్వం కానీ, ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కానీ ఇంతవరకు స్పందించలేదు.

    ఖోస్ట్‌లో నివసించే వజీరిస్థాన్‌కు చెందిన ఒక గిరిజన పెద్ద మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలోని వజీరిస్థాన్ వలసదారుల శిబిరాన్ని పాకిస్థాన్ వైమానిక దళం లక్ష్యంగా చేసుకుంది, కనీసం 30 మంది మరణించారని చెబుతున్న వీడియోను ఆఫ్ఘన్ మీడియా ప్రసారం చేస్తోంది.

    Trending Stories

    Related Stories