More

  చెత్త పనుల్లో ఆ దేశం నెంబర్ వన్..! పేరు తెలిస్తే షాక్ తింటారు..!!

  విచక్షణా రహితంగా పెద్ద ఎత్తున దారుణ కృత్యాలు చోటుచేసుకునే దేశాలు ఏవి..? సామూహిక హత్యలు జరిగే ప్రమాదం వున్న దేశాలు ఏవి..? భారీ స్థాయిలో హత్యాకాండ జరిగే దేశాల్లో ప్రథమ స్థానం ఏ దేశం పొందుతోంది..? ఈ చెత్త పురస్కారాన్ని.. ఆ దిక్కుమాలిన దేశం ఎన్నిసార్లు సాధించింది..? ఈ వివరాలన్నీ అమెరికాకు చెందిన ఎర్లీ వార్నింగ్ ప్రాజక్ట్ సవివరంగా వెల్లడించింది. సిగ్గు, శరం లేని ఆ దేశంలో నేరాలు, ఘోరాలు చూసే ముందు.. కొన్ని ఉత్తమ చెత్త ఉదాహరణలు చూద్దాం.

  వెనకటికి ఓ పత్రిక చెత్త కథల పోటీ పెట్టింది.. ఏ మాత్రం కొత్తదనం లేకుండా అంతా జుగుప్సగా చెత్తకథ వుండాలని షరతులు పెట్టింది. ఏ మాత్రం మంచి, మానవత్వం, మర్యాద, మన్నన అనే పదాలు వుండకుండా, హేయంగా, నీచంగా వున్న కథను ఉత్తమ చెత్తకథగా నిర్ణయిస్తామని ఆ పత్రికా యాజమాన్యం తెలిపింది. దీంతో, ఆ కథను జడ్జి చేసే న్యాయ పరిశీలకులకు.. ఉత్తమ చెత్త కథను సెలక్ట్ చేసేటప్పటికి తల ప్రాణం తోకకు వచ్చినట్టయ్యింది. ఎందుకంటే.. ఎవరు రాసిన కథలోనైనా, కనీసం ఒక ముక్కయినా మంచి మాట కనిపించింది. మంచి మనసు దర్శనమిచ్చింది. అయితే, పాక్ కు పాపం అప్పుడు ఈ విషయం తెలిసుంటే..ఖచ్చితంగా ఫస్ట్ ప్రయిజ్ కొట్టేసేదేమో. పాపం బ్యాడ్ లక్.

  దారుణకృత్యాలు, హత్యలు జరిగే దేశాల్లో.. యావత్ ప్రపంచంలోనే పాక్ దేశం ముందు వరుసలో నిలిచింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ముచ్చటగా మూడుసార్లు ఈ ఘోర అవార్డ్ సాధించేసింది. తాజాగా అమెరికా పరిశోధన సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ తిరస్కార పురస్కారాన్ని పాక్ అందుకుంది. US థింక్-ట్యాంక్ ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్ట్ తాజా అంచనా ప్రకారం, సామూహిక హత్యలకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో పాకిస్థాన్ మరోసారి నిలిచింది. వరుసగా మూడోసారి అగ్రస్థానంలో నిలిచి దిక్కుమాలిన పనులు చేయడంలో హ్యాట్రిక్ సాధించింది.

  సామూహిక హింసకు గురయ్యే దేశాలను గుర్తించి, ప్రపంచానికి తెలియజేసే పరిశోధన సంస్థ ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్ట్ .. పాక్ నిర్వాకాన్ని పూసగుచ్చినట్టు వివరించింది. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ ద్వారా పెరుగుతున్న హింస, ఇతర హింసాకాండలపై ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్ట్ తన 28-పేజీల నివేదికలో పూర్తి వివరాలు తెలిపింది. తొలి పది జాబితాలోని ఇతర ఆసియా దేశాలలో మయన్మార్ రెండో స్థానంలో, యెమెన్ మూడో స్థానంలో ఉన్నాయి. గత నెలలో KP లక్కీ మార్వత్ జిల్లాలో జరిగిన అత్యంత పాశవిక దాడిలో కనీసం ఆరుగురు పోలీసులు మరణించారు. పాకిస్థాన్, తాలిబాన్ ఉద్యమ అనుబంధ మిలీషియాల ద్వారా సామూహిక హత్యలు జరుగుతున్నట్టు ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్ట్ గత ఏడాది చివరన నిర్ధారించింది. ఈ ఎపిసోడ్ కొనసాగడం, పెరగడం ప్రమాదకరం అని నివేదిక పేర్కొంది.

  హితులారా.. చూశారు కదా.. చెత్త ర్యాంకుల్లో హ్యాట్రిక్ సాధించిన కుక్క తోక వంకర దేశం కథ. ఇక..మీరు చేయాల్సి పని గుర్తుంది కదా..! మన గ్రూపాఫ్ ఛానెల్స్ ను సబ్ స్క్రయిబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. పదిమందికీ ఈ వీడియోను షేర్ చేసి జాతీయవాద జర్నలిజానికి మద్దతు తెలపండి.

  Trending Stories

  Related Stories