More

    ఇమ్రాన్‌ఖాన్‌ ర్యాలీని కవర్ చేస్తూ.. వాహనం కింద పడిపోయిన మహిళా జర్నలిస్ట్

    పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ చేపట్టిన నిరసన ర్యాలీని కవర్‌ చేసేందుకు వచ్చిన ఓ మహిళా జర్నలిస్ట్‌ కంటైనర్‌ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని ఛానల్‌ 5 రిపోర్టర్‌ సదాఫ్‌ నయీమ్‌గా గుర్తించారు. అంతకు గంట ముందే ఆమె ఇమ్రాన్‌ఖాన్‌ను కూడా ఇంటర్వ్యూ చేసింది. పాకిస్తాన్‌లో షాబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో లాంగ్ మార్చ్‌ నిర్వహించారు. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రసంగించేందుకు కంటైనర్‌ వాహనాన్ని పార్టీ నేతలు సమకూర్చారు. లాంగ్ మార్చ్‌ జరుగుతుండగా కంటైనర్‌పై ఉన్న జర్నలిస్ట్ సదాఫ్ నయీమ్‌ను వెనుక నుంచి ఎవరో తాకడంతో కిందపడిపోయింది. ఈ క్రమంలో ఆమె మెడపై నుంచి కంటైనర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం లాహోర్‌లో ప్రారంభించిన ఈ లాంగ్‌ మార్చ్‌ నవంబర్‌ 4 వ తేదీన ఇస్లామాబాద్‌లో ముగియనుంది. మహిళా జర్నలిస్టు సదాఫ్‌ మరణం ఎంతో బాధాకరమైనదని ఇమ్రాన్‌ఖాన్‌ చెప్పుకొచ్చారు. సరిగ్గా ఒక్క రోజు క్రితం ఇమ్రాన్‌ఖాన్‌ను ఆమె ఇంటర్వ్యూ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

    Trending Stories

    Related Stories