Sports

భయం భయంతో పాకిస్తాన్ లో క్రికెట్ ఆడలేం.. గుడ్ బై

హలో ఫ్రెండ్స్…
ఈ ప్రపంచంలో… టూరిస్టులు వెళ్లేందుకు భయపడే కంట్రీ ఏదో మీకు తెలుసా? ఇందులో ఆలోచించడానికి ఏముందన్న..! పాకిస్తాన్ అంటూ.., ఎవరి నుంచైనా సరై! టక్కున సమాధానం వస్తుంది.! అవును…! వరల్డ్ మొత్తంలో డేంజరస్ కంట్రీ ఏదైనా ఉందా అంటే అది పాకిస్తానే. సోమాలియా పైరట్లనైనా నమ్మవచ్చునేమోగానీ.. పాకిస్తాన్ లోని ఉగ్రవాదులను మాత్రం నమ్మం లేం.! సోమాలియావాడిది ఆకలి పోరాటమని అనుకుంటే.., పాకిస్తాన్ లోని ఉగ్రవాదులది మతోన్మాదం..! ప్రపంచంలో తమ ఇస్లామిక్ షరియా తప్ప.., వేరే ఇతర మతాలు ఉండకూడదనే ఉన్మాదం వారి సోంతం.
పాకిస్తాన్ పుట్టుకకు కూడా ఇస్లామిక్ మతోన్మాదమే కారణమనే విషయం మనం మర్చిపోరాదు. పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదులకు పుట్టినిల్లు.! కుటిర పరిశ్రమల నుంచి ఎలాగైతే వస్తువులు ఉత్పత్తి అవుతాయో..! అదే మాదిరిగా పాకిస్తాన్ లోని మదర్సాల నుంచి ఇస్లామిక్ టెర్రరిస్టులు పుట్టుకుని వస్తుంటారనే విమర్శలు ఉన్నాయి.!
అనేక దేశాలు తమ దేశ పౌరులు ఎవరూ కూడా పాకిస్తాన్ కు వెళ్లవద్దు అంటూ హెచ్చరికలు కూడా జారీ చేశాయి. ఏదైనా అత్యవసర పనిమీద ఆ దేశం వెళ్లినప్పుడు ఎంబసీతో టచ్ లో ఉండాలని ఆయా దేశాలు తమ పౌరులకు సూచిస్తుంటాయి. ఇది విఫల దేశం పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి.!
అయితే ప్రభుత్వాన్ని నడిపేందుకు దమ్మిడి పైసా లేకున్న.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం తమ దేశం గురించి బాగా బిల్డప్ ఇస్తుంటాడు. ఇమ్రాన్ ఎంత ప్రయత్నించిన వరల్డ్ వైడ్ గా మాత్రం పాకిస్తాన్ కున్న టెర్రరిస్టు కంట్రీ ముద్ర అనేది పోవడం లేదన్నది కఠోర వాస్తావం.! ప్రస్తుతం కమ్యూనిస్టు గుంటనక్క… చైనా మాత్రమే పాకిస్తాన్ ను నమ్ముతోంది. అది తన అవసరాల కోసమేనని మనం మర్చిపోరాదు.
ప్రస్తుతం పాకిస్తాన్ లో… గేమ్స్ ఆడేందుకు ఏ ప్రపంచ దేశం కూడా ముందుకు రావడం లేదన్నది వాస్తవం.! అయితే క్రికెట్ కు ఉన్న క్రేజ్ ను అడ్డం పెట్టుకుని., పాకిస్తాన్ కున్న టెర్రరిస్టు దేశం అనే ముద్రను చెరిపివేసేందుకు.., ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం వేసిన ఓ ఎత్తు చిత్తు అయ్యింది.
అదేంటో తెలుసా…? న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ పాకిస్తాన్ టూర్. ! ప్రస్తుతం పాకిస్తాన్ లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని.., తమ దేశంలో భద్రతపరమైన ఎలాంటి సమస్యలు లేవని.., న్యూజిలాండ్ జట్టు తమ దేశంలో టూర్ కు వస్తే…, పుల్ సెక్యూరిటీ ఇస్తామని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం హామీలు ఇచ్చింది.
దీంతో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కూడా అనుమానాలు పడుతూనే.., పాకిస్తాన్ లో పర్యటించేందుకు ఒప్పుకుంది. అక్టోబర్ మూడో తేదీ వరకు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచులు ఆడేందుకు, న్యూజిలాండ్ క్రికెట్ టీమ్.., దాదాపు 18 ఏళ్ళ తర్వాత పాకిస్తాన్ లో అడుగు పెట్టింది.
రావల్పిండి స్టేడియంలో ఇవాళ సెప్టెంబర్ 17న పాకిస్తాన్, కివీస్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగాల్సి ఉంది. మ్యాచ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పూర్తి చేసింది. భద్రతపరమైన సమస్యలు…, కొవిడ్ నేపథ్యంలో సమస్యలు వస్తాయని.., స్టేడియంలోకి ప్రేక్షకులను సైతం పాకిస్తాన్ అలో చేయలేదు.!
ఇక మరికొన్ని నిమిషాల్లో ఇరు జట్ల ఆటగాళ్లు టాస్ వేసేందుకు గ్రౌండ్ లోకి వస్తారనే ముందు.., న్యూజిలాండ్ ఆటగాళ్లు…పాకిస్తాన్ ను అల్ ఆఫ్ సడన్ గా షాకింగ్ గురిచేసే విషయం చెప్పారు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయినంత పని అయ్యింది.
ఇంతకీ ఆ విషయం ఏంటో తెలుసా…? తాము పాక్ టూర్ ను రద్దు చేసుకుంటున్నామని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మ్యాచ్ కు కొద్ది నిమిషాల ముందు ప్రకటించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందుకు.., న్యూజిలాండ్ ప్రభుత్వానికి…రావల్పిండిలోని తమ ఆటగాళ్ల సెక్యూరిటీకి సంబంధించిన థ్రెట్ కాల్స్ వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. న్యూజిలాండ్ భద్రతా అధికారులు సైతం.. పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భద్రత ఏర్పాట్లపై అనుమానాలు వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. దీంతో తుపాకీ నీడలో భయపడుతూ క్రికెట్ ఆటలేమని.. న్యూజిలాండ్ ఆటగాళ్లు సైతం తమ క్రికెట్ బోర్డుకు స్పష్టం చేసినట్లు సమాచారం.
దీనికితోడు ఈ రోజు మ్యాచ్ ప్రారంభానికి ముందు… పాకిస్తాన్ ఇంటలిజెన్స్ అధికారులు సైతం…తాము చెప్పే వరకు, ఇరు జట్ల ఆటగాళ్లు తమ హోటల్ గదుల నుంచి బయటకు రావొద్దు అంటూ హెచ్చరించినట్లుగా చెబుతున్నారు., దీంతో ఆటగాళ్లు కూడా తమ హోటల్ గదులకే పరిమితం అయ్యారు.
న్యూజిలాండ్ క్రికెట్ టీమ్… తమ టూర్ ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించడంతో.. పాకిస్తాన్ ప్రభుత్వం ఒక్కసారిగా ఖంగుతిన్నది. కివీస్ టూర్ అర్థంతరంగా రద్దు అయితే అంతర్జాతీయంగా పాకిస్తాన్ కు ఉన్న.., ఆ కాస్త పరువు కూడా.., మంటగలిసే ప్రమాదం ఉందని భావించి ఇమ్రాన్ ఖాన్ వెంటనే రంగంలోకి దిగి.., ఈ టూర్ ను కొనసాగాలే చివరి వరకు ప్రయత్నించినట్లు సమాచారం.
ఒక దశలో న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్ సైతం ఇమ్రాన్ ఖాన్ ఫోన్ చేసి… తమ దేశం పరువు కాపాడాలని , టూర్ ను అర్థంతరంగా రద్దు చేసుకోవద్దని , పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వరల్డ్ వైడ్ గా ఎంతో గొప్పదని , న్యూజిలాండ్ కు తప్పుడు సమాచారం ఇచ్చారని , న్యూజిలాండ్ ఆటగాళ్ల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని.., రావల్పిండిలో ఇవాళ్టి మ్యాచ్ ప్రారంభానికి సెక్యూరిటీ క్రాస్ చెక్ లో భాగంగానే ప్రేక్షకులను సైతం అనుమతించలేదని… ఇలా పలు విధులుగా.., న్యూజిలాండ్ ప్రధానిని ఇమ్రాన్ ఖాన్ ఒప్పించే ప్రయత్నం చేశాడని , అయితే న్యూజిలాండ్ ప్రధాని జసిండా మాత్రం, ఇమ్రాన్ మాటలను విశ్వాసంలోకి తీసుకోలేదని పాక్ తో టూర్ రద్దుకే ఆమె మొగ్గుచూపినట్లు ప్రచారం జరుగుతోంది.
నిజానికి రావల్పిండి అనేది పాకిస్తాన్ ఆర్మీ ముఖ్యకేంద్రం. పాక్ ఆర్మీ ముఖ్యకేంద్రంలోని స్టేడియంలోనే సెక్యూరిటీ థ్రెట్స్ ఉంటే.., న్యూజిలాండ్ మాత్రం ఏం చేస్తుంది చెప్పండి..! అందుకే.. తూపాకీ నీడ…, ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయంతో…, ఏ ఇస్లామిక్ టెర్రరిస్టు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాడో..? అంటూ బిక్కు బిక్కుమంటూ.., తాము పాకిస్తాన్ తో క్రికెట్ ఆడలేమని కివీస్ ఆటగాళ్లు…, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెగేసి చెప్పినట్లుగా., వారు చేసిన ట్వీట్లను పరిశీలిస్తే అర్థం అవుతుంది.
గతంలో 2009లో పాకిస్తాన్ లో ఒకసారి శ్రీలంక క్రికెట్ పై ఉగ్రదాడి జరిగింది. లాహోర్ లోని గడాఫీ స్టేడియానికి శ్రీలంక ఆటగాళ్లు బస్సులో వెళ్తున్న సమయంలో ఇస్లామిక్ ఉగ్రమూకలు వారి బస్సుపై కాల్పులు జరిపాయి. ఈ దాడిలో ఆటగాళ్లకు కాపాలాగా ఉన్న ఐదురుగు సెక్యూరిటీ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా…, ఐదుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటన తర్వాత ప్రపంచంలోని మరే దేశం పాకిస్తాన్ లో క్రికెట్ ఆడేందుకు ముందుకు రాలేదు. అయితే దాదాపు 10 ఏళ్ళ తర్వాత 2019లో శ్రీలంక జట్టు… పాకిస్తాన్ లో మరోసారి పర్యటించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కూడా పర్యటించింది. అయితే ప్రస్తుతం అఫ్గాన్ లో తాలిబన్లు అధికారంలోకి రావడంతో.. ఇరు దేశాల్లో నెలకొన్న కల్లోల పరిస్థితులు దృష్ట్యానే.., న్యూజిలాండ్ టీమ్ వెనక్కితగ్గి ఉండవచ్చునని కొంతమంది విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏదీ ఏమైనా న్యూజిలాండ్ క్రికెట్ టీమ్… తన టూర్ రద్దు చేసుకోవడంతో , అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు పోయింది. అదో విఫల దేశమని మరోసారి ప్రపంచానికి రూడీ అయ్యింది. మరీ దీనిపై మీరేమంటారు.? కామెంట్ల రూపంలో తప్పక తెలియజేయండి. మనసా వాచా కర్మణా దేశహితం కోసం పాటుపడండి.
భారత్ మాతాకీ జై.

Related Articles

Back to top button