భయపడుతూ బ్రతుకుతున్న మసూద్.. రక్షణ కల్పిస్తున్న పాక్ సైన్యం

0
810

భారత్ లో ఎన్నో దారుణాలకు సూత్రధారి అయిన మసూద్ అజర్.. ఇప్పుడు భయం భయంగా బిక్కు బిక్కుమంటూ పాక్ సైన్యం సంరక్షణలో ఉన్నాడని కథనాలు వస్తున్నాయి. ఆల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ ను చంపినట్లే తననూ చంపేస్తారని జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్ తెగ భయపడిపోతున్నాడు. అజర్ మసూద్ బహవల్‌పూర్‌లో రెండు విలాసవంతమైన భవనాల్లో ఉంటున్నాడు. ఒకటి ఒస్మాన్-ఒ-అలీ మసీదు పక్కన ఉంటే, మరోటి అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జామియా మసీదు పక్కన ఉందట..! ఈ రెండింటికీ పాక్ సైన్యం భద్రత కల్పిస్తోంది. ఈ రెండు భవనాలున్న ప్రాంతాలు నిత్యం రద్దీగా ఉంటాయి. కాబట్టి అక్కడ ఏం జరిగినా క్షణాల్లో అజర్‌కు తెలిసిపోతుంది.

లాడెన్ తలదాచుకున్న విధానానికి వ్యతిరేకంగా మసూద్ ప్రణాళికలు ఉన్నట్లు తెలుస్తోంది. అప్పట్లో లాడెన్ ఉన్న అబోటాబాద్‌లో జనసంచారం అంతగా ఉండదు. అమెరికా దళాలు అతడిని సులభంగా మట్టుబెట్టగలిగాయి. భారత ప్రభుత్వం నుంచి తనకు అలాంటి గతి పట్టకూడదన్న ఉద్దేశంతోనే అజర్ ఈ ప్రాంతాలను ఎంచుకున్నాడు. సైన్యం లాంటివి వచ్చినా తమ అనుచరులు గమనించేస్తారని మసూద్ భావిస్తూ ఉన్నాడు.

2001 భారత్‌ పార్లమెంట్‌పై దాడి సహా పలు ఉగ్రదాడుల్లో ప్రధాన కుట్రదారుడైన మసూద్‌ అజార్‌ను పాక్‌ ప్రభుత్వం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటోంది. మతం పేరుతో యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నాడు. అతడికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అమెరికా పాక్ లో అడుగుపెట్టి ఒసామా బిన్ లాడెన్ ను చంపగా లేనిది భారత్ కూడా మసూద్ అజర్ ను చంపే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే చాలా వరకూ వార్తలు వచ్చాయి. దీంతో మసూద్ అజర్ తప్పించుకుంటూ ఉండడమే కాకుండా పాక్ సైన్యం రక్షణలో తలదాచుకుంటూ ఉన్నట్లు తెలుస్తోంది.

2001లో భారత పార్లమెంటుపై జరిగిన దాడి కేసులో మసూద్ అజర్ భారత్‌కు మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది. కరుడుగట్టిన ఉగ్రవాది అయిన మసూద్‌ను పాక్ ప్రభుత్వం మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటోంది. అతడికి ఎలాంటి హానీ కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ రక్షణ కూడా కల్పిస్తోంది. భారత పార్లమెంటుపై దాడితోపాటు 2016 పఠాన్‌కోట్ దాడి, 2019లో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై దాడి కేసులోనూ అజర్ హస్తం ఉందని భారత ప్రభుత్వం స్పష్టమైన సాక్ష్యాలను పాకిస్థాన్‌కు పంపింది. అయినప్పటికీ అతడిని భారత్ కు అప్పగించలేదు పాకిస్తాన్. ఓ వైపు ప్రపంచ దేశాలు పాకిస్తాన్ కు షాక్ ల మీద షాక్ లు ఇస్తూ ఉన్నా కూడా తన వైఖరిని మార్చుకోలేకపోతోంది. తీవ్రవాదులకు తొత్తులుగా వ్యవహరిస్తూనే ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉంది. అజహర్ యొక్క రహస్య ప్రదేశాలకు కాపలాగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లలో పాకిస్తాన్ సైన్యం ఉండడం ఆ దేశ వక్ర బుద్ధి ప్రపంచ దేశాల ముందు మరోసారి బయటపడింది. ఆర్ధిక ఆంక్షల నుండి తప్పించుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తూ ఉందని ఆ దేశాధినేతలు ఓ వైపు చెబుతూ ఉన్నారు. పాక్ ఉగ్రవాదానికి సహాయపడదు, ప్రోత్సహించదు.. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, కాపాడటం వంటివి జరగవని అంటున్నా అవన్నీ బాహ్య ప్రపంచానికి మాత్రమేనని స్పష్టంగా తెలుస్తోంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here