More

  పాక్ కొత్త ఆర్మీ చీఫ్‎గా.. పుల్వామా మాస్టర్ మైండ్..!

  చెడ్డ పనులు, పాడుపనులు చేసిన ఘనుల లిస్ట్ తీసి.. అందులోంచి మహా ఘనుని ఎన్నుకోవడం పాకిస్థాన్ కు వెన్నతో పెట్టిన విద్య. పుల్వామా దాడి రూపశిల్పి, ISI మాజీ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్‌ను తదుపరి ఆర్మీ చీఫ్‌గా పాక్ ఎంచుకుంది. ప్రస్తుత చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా, మూడేళ్ల పొడిగింపు పొందిన అనంతరం, నవంబర్ 29న పదవీ విరమణ చేయనున్నారు. ఇదే సమయంలో, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్‌గా లెఫ్టినెంట్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని సమాచార శాఖ మంత్రి ఔరంగజేబ్ ట్విట్టర్‌లో ప్రకటించారు. రాజ్యాంగ అధికారాన్ని ఉపయోగించి, పాకిస్తాన్ ప్రధాన మంత్రి ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్, లెఫ్టినెంట్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాను జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్‌గా ఎన్నుకున్నారని తెలిపారు. అలాగే, లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్‌ను చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నామినేట్ చేయడానికి ఎంచుకున్నారని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఆర్మీ సిబ్బంది.. దీని సారాంశాన్ని పాక్ అధ్యక్షుడికి సమర్పించారు. మిత్రులారా ఈ అంశాన్ని చూసే ముందు మీరు చేయాల్సి పని గుర్తుంది కదా..! మన గ్రూపాఫ్ ఛానెల్స్ ను సబ్ స్క్రయిబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. పదిమందికీ ఈ వీడియోను షేర్ చేసి జాతీయవాద జర్నలిజానికి మద్దతు తెలపండి.

  వివాదాన్ని నివారించేందుకు అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ, ప్రధానమంత్రి సూచనను పాటించాలని ఔరంగజేబ్ నొక్కి చెప్పారు. అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ నియామకాలను వివాదాస్పదంగా చేయరని, ప్రభుత్వ సలహాను ఆమోదిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయం చట్టం, రాజ్యాంగానికి లోబడి నిర్వహించినట్టు వార్తలు వచ్చిన కొన్ని నిమిషాల తర్వాత రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మీడియాతో ముచ్చటించారు. వివాదాన్న నివారించేందుకు అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ప్రధానమంత్రి సూచనను పాటించాలని ఆయన నొక్కి చెప్పారు. రాజకీయ సలహాలు పాటించాలా లేక రాజ్యాంగ, న్యాయపరమైన సలహాలు పాటించాలా అనేది అధ్యక్షుడు అల్వీకి ఇది పరీక్ష అని ఆయన ట్విట్టర్‌లో ఇవే అభిప్రాయాలను పోస్ట్ చేశారు. సాయుధ దళాల సుప్రీం కమాండర్‌గా, రాజకీయ ఘర్షణల నుంచి దేశాన్ని రక్షించడం ఆయన కర్తవ్యం అని ఖవాజా ఆసిఫ్ అధ్యక్షుడిని ఉద్దేశించి అన్నారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఈ విషయాన్ని వివాదాస్పదంగా మారుస్తారా లేక సైన్యాన్ని బలోపేతం చేస్తారా అనే దానిపై ఇది పరీక్ష అని ఆయన అన్నారు. అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ వ్యవస్థాపక సభ్యుడు కావడం గమనార్హం, అందుకే ప్రస్తుత ప్రభుత్వం కొత్త ఆర్మీ చీఫ్ ఎంపికను ఆమోదించకపోవచ్చని భయపడుతోంది.

  సందర్భం వచ్చినప్పుడు.. తాను, పాకిస్తాన్ అధ్యక్షుడు రాజ్యాంగం, చట్టాల ప్రకారం నడుచుకుంటామని ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్‌లో పిటిఐ పేర్కొంది. రాష్ట్రపతి తనతో ఖచ్చితంగా నియామకంపై చర్చిస్తారని ఇమ్రాన్ ఇప్పటికే వెల్లడించారు. ఆర్మీ చీఫ్ నియామకానికి సంబంధించిన సారాంశంపై అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ ఖచ్చితంగా నన్నుసంప్రతిస్తారని ఇమ్రాన్ తెలిపారు. చట్టం, రాజ్యాంగం ప్రకారం నిర్ణయం ఉంటుందని, డాక్టర్ అల్వీ ఉన్న పార్టీకి నేను అధిపతిని అని మాజీ ప్రధాని అన్నారు.

  తొలి రెండు స్థానాలకు పోటీ పడుతున్న ముగ్గురు అభ్యర్థుల్లో లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ ఒకరు. 2019 ఫిబ్రవరి లో పుల్వామా ఉగ్రదాడి 40 మంది సిఆర్‌పిఎఫ్‌ల ప్రాణాలను బలిగొంది. అనంతరం భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఆ సమయంలో.. ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అసిమ్ వున్నారు. ఆ సమయంలో పాకిస్తాన్ ప్రతిచర్య, భద్రతా చర్యలను నిర్ణయించడంలో నిమగ్నమైన సైనిక నిర్ణయాధికారులలో మునీర్ సైతం ఉన్నట్టు తెలిసింది.

  పుల్వామా ఉగ్రదాడిని పర్యవేక్షించిన వారిలో అసిమ్ మునీర్ ఉన్నారని మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు సభ్యుడు తిలక్ దేవాషెర్ తెలిపారు. 2019 లో ISI DGగాను ఈయన పనిచేశాడని తిలక్ చెప్పారు. భారత్ లోని కాశ్మీర్ ను పట్టించుకోని, డీల్ చేసిన ప్రాంతాల్లో అసిమ్ పనిచేశాడని, ఈ కారణంగా ఆయనకు ఈ ప్రాంతం సుపరిచితం అణి దేవాషేర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

  Trending Stories

  Related Stories