More

    ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నం..! కాల్లోకి దూసుకెళ్లిన బుల్లెట్..!!

    పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌పై హత్యాయత్నం జరిగింది. ఇమ్రాన్ ఖాన్ పై ఏకే-47 గ‌న్‌తో అటాక్ చేశారు. వ‌జీరాబాద్‌లో జ‌రిగిన ర్యాలీలో ఆయ‌న‌పై దాడి జరిగింది. దుండ‌గుడు స‌మీపం నుంచే ఏకే-47 గ‌న్‌తో కాల్చిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ కాలులోకి బుల్లెట్లు దిగిన‌ట్లు పీటీఐ పార్టీ నేత ఇమ్రాన్ ఇస్మాయిల్ తెలిపారు. ఇమ్రాన్‌పై దాడి జ‌రిగిన‌ప్పుడు తాను ప‌క్క‌నే ఉన్న‌ట్లు ఇస్మాయిల్ చెప్పారు. గాయ‌ప‌డ్డ ఇమ్రాన్‌ను వెంట‌నే హాస్పిట‌ల్‌కు తీసుకువెళ్లారు. వ‌జీరాబాద్ లాంగ్ మార్చ్ స‌మ‌యంలో ఇమ్రాన్‌పై దాడి జ‌రిగిన‌ట్లు పీటీఐ నేత ఫ‌వ‌ద్ చౌద‌రీ తెలిపారు. ఈ దాడిలో మ‌రో తొమ్మిది మంది గాయ‌ప‌డ్డారు. ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్లనున్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్లు పాక్ మీడియా చెబుతోంది.

    Trending Stories

    Related Stories