More

  టైలర్ కన్హయ్య హత్యపై స్పందించిన ఓవైసీ..!

  రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో ఓ టైల‌ర్‌ను క్రూరంగా హ‌త్య చేసిన ఘ‌ట‌న‌పై ఎంఐఎం అధినేత‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఉద‌య్‌పూర్ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని పేర్కొన్నారు.

  ద‌ర్జీని హ‌త్య చేసిన ఇద్ద‌రు నిందితుల‌పై రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ఆశిస్తున్నాన‌ని తెలిపారు. పోలీసులు అప్ర‌మ‌త్తంగా ఉంటే ఈ ఘ‌ట‌న జ‌రిగి ఉండేది కాద‌న్నారు. తీవ్ర‌వాదం బాగా పెరిగిపోతుంద‌న్నారు. నుపుర్ శ‌ర్మ స‌స్పెన్ష‌న్ చేయ‌డం కాదు.. ఆమెను అరెస్టు చేయాల‌ని ఎంపీ ఓవైసీ డిమాండ్ చేశారు.

  ఉద‌య్‌పూర్‌లో జ‌రిగిన టైల‌ర్ హ‌త్య కేసును జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌కు అప్ప‌గిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ద‌ర్జీ క‌న్హ‌య్య‌లాల్‌ను ఇద్ద‌రు ఆగంత‌కులు క‌త్తితో దాడి చేసి చంపారు. అయితే ఈ ఘ‌ట‌న‌లో తీవ్ర‌వాదులు లేదా ఉగ్ర‌వాదుల హ‌స్తం ఉందా లేదా తేల్చేందుకు కేసును ఎన్ఐఏకు అప్ప‌గించారు. విదేశీ కుట్ర కోణాన్ని కూడా ఆ ద‌ర్యాప్తు సంస్థ ప‌రిశీలించ‌నున్న‌ది. ద‌ర్యాప్తు అంశంపై ఇవాళ కేంద్ర హోంశాఖ ఓ ట్వీట్ కూడా చేసింది. క‌న్హ‌య్య‌లాల్ హ‌త్య నేప‌థ్యంలో ఉద‌య్‌పూర్‌లో క‌ర్ఫ్యూ విధించారు. రాష్ట్ర‌వ్యాప్తంగా 144 సెక్ష‌న్ విధించారు. రాబోయే 24 గంట‌ల పాటు ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని నిలిపివేశారు.

  Trending Stories

  Related Stories