అకాల వర్షాలు అతలాకుతులం చేస్తున్నాయి. అస్సొం రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్నాయి. మరోవైపు కేరళ, బిహార్, అసోంతో సహా పలు ప్రాంతాలు వరదలు, వర్షాలతో అతలాకుతమయ్యాయి. రోడ్లు, పంటలు, వర్షానికి కొట్టుకుపోయాయి. వర్షపు నీరు, వరద నీరుతో ప్రాంతాలు జలమయం అయ్యాయి.
భారీ వర్షాలకు, వరదలకు ఇళ్లు నేలమట్టం కావడంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక కర్నాటకలో కూడా ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. బిహార్‌లో వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకూ 25 మంది ప్రాణాలు కోల్పోయారని అక్కడి అధికారులు వెల్లడించారు. ముజఫర్ నగర్‌లో ఐదుగురు, భాగల్‌పూర్‌లో నలుగురు, లఖీసారీలో ముగ్గురు, సారన్లో ముగ్గురు.. జుమై తదితర ప్రాంతాల్లో కూడా ప్రజలు మరణించారు. వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా హృషీకేశ్- యమునోత్రి జాతీయ రహదారులను అధికారులు మళ్లీ మూసేశారు. పరిస్థితులు కాస్త బాగుపడటంతో జాతీయ రహదారులను ఓపెన్ చేశారు. అయితే శుక్రవారం నుంచి భారీ వర్షాలు మళ్లీ పడుతుండటంతో అధికారులు ఆ హైవేను మళ్లీ మూసేశారు. దీంతో జంకీచట్టీ తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వర్షాలు, వరదల కారణంగా అసోం ప్రజల పరిస్థితి దుర్భరంగా తయారైంది. 8 లక్షల మంది ఈ వరదలు, వర్షాల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 3 వేల గ్రామాలు, 29 జిల్లాలు ఈ వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నాయి. 14 మంది మరణించారు. ఇక.. వర్షాలు, వరదల వల్ల 500 కుటుంబాల రైల్ పట్టాల మీదే తలదాచుకుంటున్నాయి. వరదల కారణంగా తాము సర్వస్వాన్నీ కోల్పోయామని ఆ కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే… వీరి కోసం సహాయక శిబిరాలను అధికారులు ఏర్పాటు చేశారు.