కేంద్ర ప్రభుత్వం తమకు అవసరమైనంత మేరకు వ్యాక్సిన్ సరఫరా చేయడం లేదని పలు రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. కేంద్రప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు అనవసర రాజకీయాలకు తెరలేపాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తాము ఇచ్చిన వ్యాక్సిన్లు ఇంకా అయిపోలేదని తేల్చి చెప్పాయి. ఇప్పటికీ రాష్ట్రాల వద్ద 1.6 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 21 కోట్ల వ్యాక్సిన్ డోసులను సరఫరా చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం 2,67,110 వ్యాక్సిన్ డోసులు సరఫరా ప్రక్రియలో ఉన్నాయని మూడు రోజుల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వాటిని అందుకుంటాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటికే 21 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించామని తెలిపింది.. మే 21, 2021 నాటికి 19,73,61,311 డోసులను ప్రజలకు ఇవ్వగా.. 1,60,13,409 డోసులు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల దగ్గర ఇంకా ఉన్నాయని స్పష్టం చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.
వ్యాక్సిన్లను రాష్ట్రాలు పెద్ద ఎత్తున టీకాలను వేస్ట్ చేస్తూ ఉండడం కూడా ప్రజలకు వ్యాక్సిన్లు తక్కువ అవ్వడానికి కారణం అవుతూ ఉన్నాయి. టీకా వ్యర్థాలను తగ్గించుకుంటేనే వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత వేగంగా సాగుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉంది. హిందీ డైలీ ‘పత్రిక’ రిపోర్టుల ప్రకారం ఒక్క రాజస్థాన్ రాష్ట్రంలోనే 11.5 లక్షల వ్యాక్సిన్లు వ్యర్థమయ్యాయి. అది ఏకంగా 7 శాతం. రాజస్థాన్ లోని ఎన్నో జిల్లాలు వ్యాక్సిన్ లను వేస్టు చేస్తూ ఉన్నాయి. చురు జిల్లాలో వ్యాక్సిన్ వేస్టేజీ రేటు ఏకంగా 39.7 శాతం ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. హనుమాన్ ఘర్ జిల్లాలో 24.60 శాతం, భరత్ పూర్ 17.13 శాతం, కోటాలో 16.71 శాతం వేస్టేజీ నమోదైంది. వ్యాక్సిన్ విషయంలో ఈ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఎంతో నిర్లక్ష్యం వహిస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. యూనియన్ మినిస్టర్, జోధ్ పూర్ ఎంపీ గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై వ్యాక్సిన్ వేస్టేజీ విషయంలో తీవ్రంగా విమర్శించారు.
వ్యాక్సిన్ వేస్టేజీ అన్నది ఘోర తప్పిదమని భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందు నుండి హెచ్చరిస్తూ వస్తున్నారని. వ్యాక్సిన్ లను వ్యర్థం చేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడమేనని చెబుతున్నా కూడా రాజస్థాన్ ప్రభుత్వం అవేవీ పట్టించుకోకుండా ఉందని గజేంద్ర సింగ్ తప్పుబట్టారు. ఈ తప్పులకు కారణమవుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వ్యాక్సిన్లు వృధా అవ్వకుండా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధాని మోదీ ముందు నుండి హెచ్చరిస్తూనే ఉన్నారు. వ్యాక్సిన్ల కొరత ప్రస్తుతం ఉందని.. అయితే వ్యాక్సిన్ వృధాను కూడా అరికట్టాలని మోదీ కోరారు. ఒక్క డోసు వృధా కాకుండా ఆపగలిగామంటే.. ఒక్క ప్రాణానికి రక్షణ కలిగించినట్లేనని మోదీ తెలిపారు. వ్యాక్సిన్లు రాష్ట్రాలకు డెలివరీ అయ్యాక.. వృధా అన్నదే లేకుండా చూసుకోవాలని మోదీ తెలిపారు. కేరళ ,వెస్ట్ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మీజోరాం ,గోవా, అండమాన్ నికోబార్ , లక్ష్యద్వీప్, డామన్ మరియు డయ్యు దీవులు వ్యాక్సిన్ డోసులను చాల జాగ్రత్తగా ఎలాంటీ వేస్టేజ్ లేకుండా ఉపయోగించుకుంటున్నాయి