More

    ఓయూ పరిధిలో పరీక్షలు వాయిదా

    తెలంగాణ రాష్ట్రంలో పరీక్షల వాయిదా పరంపర కొనసాగుతూ ఉంది. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎంసెట్‌తోపాటు పలు పోటీ పరీక్షలు వాయిదా పడగా.. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో రేపట్నుంచి (జులై 14) ఈనెల 16 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ తెలంగాణ విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులకు అనుగుణంగా పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఓయూ ప్రకటించింది. జులై 14 నుంచి జులై 16 వరకు జరగవల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షల షెడ్యూల్‌ను తర్వాతలోనే ప్రకటిస్తామని ఓయూ వెల్లడించింది. వర్షాల కారణంగా రాష్ట్రంలోని విద్యాసంస్థలకు జులై 16 వరకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు పొడిగించింది.

    తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 15 వరకు వర్షాలు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈనెల 14,15 తేదీలలో జరిగాల్సిన ఎంసెట్ (TS EAMCET)పై భారీ వర్షాల ప్రభావం పడింది. అంతకు ముందు షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ ఎంసెట్ పరీక్షలు జరుగుతాయని ప్రకటించిన అధికారులు.. ఇప్పుడు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా రేపు, ఎల్లుండి జరగాల్సిన అగ్రికల్చర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. జులై 18, 19, 20 న జరిగే ఎంసెట్ పరీక్షలు యధావిధిగా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి 1,71,945 మంది దరఖాస్తు చేసుకోగా.. అగ్రికల్చర్, మెడికల్‌కు 94,150 మంది పోటీ పడుతున్నారు.

    spot_img

    Trending Stories

    Related Stories