More

    9/11 ఉగ్రమూలాలపై పరిశోధన..VHP శశిధర్ కు ఉస్మానియా Ph.D..

    హైందవ సనాతన ధర్మ పరిరక్షణే ఆయన ధ్యేయం. భారతీయత, సంస్కృతి, సంప్రదాయాలంటే ఆయనకు అమితమైన ప్రేమ. హైందవ జాతి ఉన్నతి కోసం అహరహం శ్రమిస్తారు. విగ్రహం విధ్వంసమైనా.. ఆలయానికి ఆటంకం ఏర్పడినా చలించిపోతారు. గోమాత గోస పడితే చూడలేరు. వెంటనే రంగంలోకి దిగిపోతారు. ఎంతవరకైనా పోరాటం చేస్తారు. ఆయనే విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ అధికార ప్రతినిధి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి రావినూతల శశిధర్.

    దేశం శక్తిని, ఔన్నత్యాన్ని తన మేధా సంపత్తితో ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఎప్పుడూ తపనపడపడతారాయన. తాజాగా ఈ వాగ్దేవి పుత్రునికి సముచిత గౌరవం లభించింది. ‘యాంటీ టెర్రరిజం లాస్ ఇన్ పోస్ట్ నైన్ బై లెవన్ వరల్డ్ అండ్ ఇండియన్ లాస్ – ఏ కాంపారేటివ్ స్టడీ’.. అనే అంశంపై చేసిన పరిశోధనలకు గానూ.. ఉస్మానియా యూనివర్సిటీ రావినూతల శశిధర్ కు పీహెచ్డీ పట్టా ఇచ్చి సత్కరించింది. ప్రొఫెసర్ S.B.ద్వారకానాథ్ పర్యవేక్షణలో శశిధర్ రీసెర్చ్ చేసిన శశిధర్.. యూనివర్సిటీ న్యాయ విభాగం నుంచి డాక్టరేట్ పొందారు.

    అమెరికా ట్విన్ టవర్స్ పేలుళ్ల అనంతరం తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి పలు దేశాలు తీవ్రవాద వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చాయి. ఆ చట్టాల విధివిధానాలు, UNO భద్రతా మండలి తీర్మానాలు, వాటి ప్రభావం, UNO వివిధ విభాగాల ఏర్పాటు, పనితీరుపై శశిధర్ థీసిస్ సమర్పించారు. భారత దేశంలో వివిధ రూపాల్లో వున్న తీవ్రవాద మూలాలు, తీవ్రవాదం అణచివేతలో భారత్ చట్టాల పనితీరు, నూతన చట్టాల ఆవశ్యకత తదితర అంశాలపైనా లోతైనా అధ్యయనం చేసి పరిశోధనా వ్యాసాన్ని సమర్పించారు.

    తీవ్రవాద వ్యతిరేక చట్టాల అమలులో భారత దేశ కోర్టుల పాత్ర, కఠిన చట్టాల ఆవశ్యకత, మానవ హక్కుల రక్షణ ..తదితర అంశాలపైన సైతం సుదీర్ఘ అధ్యయనాలతో కూడిన పరిశోధనా పత్రాలను రావినూతన శశిధర్ సమర్పించారు. ఈ పరిశోధనకు సంబంధించి పలు అంశాలపై రావినూతల శశిధర్ రాసిన పలు ఆర్టికల్స్ ను ప్రముఖ లీగల్ జర్నల్స్ ప్రచురించాయి. పరిశోధనలో భాగంగా జాతీయ భద్రతకు సంబంధించిన పలు జాతీయ స్థాయి సెమినార్ లలో సైతం శశిధర్ పాల్గొని ప్రసంగించారు. ఈ పరిశోధనలో చేసిన పలు సూచనలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని పలువురు న్యాయ నిపుణులు శశిధర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రంలో అనేక విద్యార్థి ఉద్యమాలకు, సామాజిక ఉద్యమాలకు రావినూతల శశిధర్ నాయకత్వం వహించి ఆల్ రౌండర్ గాను పేరు ప్రతిష్ఠలు పొందారు.

    తీవ్రవాద వ్యతిరేక చట్టాలపై విస్తృత పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుండి రావినూతల శశిధర్ డాక్టరేట్ అవార్డు సాధించడం పై పలు రంగాల ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    Trending Stories

    Related Stories