ఆ మొసలి పేరు ఒసామా..! ఎవరిని ఉద్దేశించి ఆ పేరు పెట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ మొసలికి ఆ పేరును పెట్టింది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్ ను ఉద్దేశించే..! ఆఫ్రికన్ దేశం ఉగాండాలోని విక్టోరియా సరస్సులో ఉండే ఒసామా అనే మొసలి మనుషుల మాంసానికి బాగా అలవాటు పడింది. 1991 నుండి 2005 మధ్య, ఒసామా లుగాంగా గ్రామంలో 83 మందిని తినేసింది. మనుషుల మాంసంపై ఇష్టాన్ని పెంచుకున్న ఈ రాకాసి మొసలి.. ఇష్టం వచ్చినట్లుగా తినడాన్ని మొదలు పెట్టింది.

ఈ మొసలి ముక్కు నుండి తోక వరకు 5 మీటర్ల పొడవు ఉంది. ఏకంగా ఆ గ్రామ జనాభాలో 10% మందిని చంపేసిందంటే ఈ మొసలి మనిషి మాంసానికి ఎంతగా అలవాటు పడిందో అర్థం చేసుకోవచ్చు. ఇది 12 ఏళ్ల బాలుడు నుండి వృద్ధుడి వరకూ ఎవరినీ విడిచిపెట్టలేదు. పిల్లలు నీటిని తీసుకుని వెళ్ళడానికి సరస్సు దగ్గరకు వచ్చినప్పుడు నీటి లోకి లాక్కుని వెళ్ళిపోతూ ఉండేది. ఇక ఫిషింగ్ బోట్ల క్రింద ఈదుతూ.. వాటిని కదిలించి.. నీటిలో పడిపోయేలా చేసి ఆ బోట్లలోని వాళ్ళను కూడా తినేసిందని ప్రజలు చెబుతూ ఉండే వాళ్లు. కొన్ని కొన్ని సార్లు జనావాసాల్లోకి వచ్చి జంతువులను కూడా తింటూ ఉండేది. బోట్ల ఆడుగు భాగం నుంచి ఒక్క ఉదుటున పైకి లేచి వాటిని తలకిందులు చేసేస్తుందని అన్నారు. . పాల్ అనే జాలరి తన సోదరుడిని అది తన కళ్ళముందే లాక్కు పోతున్నా తానేమీ చేయలేకపోయానన్నాడు. దీన్ని చంపేయాలని స్థానికులు కోరగా అధికారులు మాత్రం దీన్ని ఉగాండాలో మొసళ్ల పెంపకందారుల వద్దకు తరలించారు.

ఇప్పుడు ఒసామా వయసు 75 సంవత్సరాలు. దీన్ని పట్టుకోడానికి చాలా ప్రయత్నాలే చేశారు. కానీ వీలు పడలేదు. గత ఏడాది మార్చిలో, ఉగాండా వైల్డ్‌లైఫ్ అథారిటీ అధికారులు, 50 స్థానికులు కలిసి దక్షిణ ఉగాండాలో జంతు మాంసాన్ని ఎరగా వేసి పట్టుకున్నారు. సాధారణంగా ఆహారం కోసం ఒసామా ఎక్కువగా వచ్చే ప్రాంతంలో ఎరను ఉంచగా.. అలా తీసుకోడానికి వచ్చి మొసలి దొరికిపోయింది. చెట్టు నుండి దాని దవడలతో వేలాడుతూ కనిపించింది. ఉగాండా క్రాస్ లిమిటెడ్‌కు ఒసామాను అప్పగించడానికి 50 మందికి పైగా ప్రయత్నించారు. తాడులపై పట్టుకొని ఒసామాను లాగి వారికి పంపారు. ఇటలీ, దక్షిణ కొరియాలోని ఫ్యాషన్ పరిశ్రమల కోసం ఇతర మొసళ్ళకు బ్రీడింగ్ స్టాక్‌గా ఉపయోగించటానికి ఒసామాను పంపించారు. ఇప్పుడు ఒసామాకు మానవ మాంసం పట్ల ఆసక్తి లేదట.. కోడి మాంసం మీద ఇష్టం పెంచుకుందని అధికారులు తెలిపారు. ఒసామాను బ్రీడింగ్ స్టాక్‌గా ఉపయోగించడం సిగ్గుచేటు అని వన్యప్రాణి ప్రేమికులు చెప్పారు.

లుగాంగా గ్రామంలోని స్థానికులు ఒసామా పేరు చెబితే ఇప్పటికీ వణికిపోతూ ఉంటారు. మనిషి తినేవాడు చాలా తేలికగా దూరమయ్యాడని నమ్మాడు. ఉగాండా క్రోక్స్ యజమాని అలెక్స్ ముతాంబ మాట్లాడుతూ ఒసామా వంటి నైలు మొసళ్ళు తన భూభాగంలోకి మనిషి వచ్చాడని తెలిస్తే దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాయని తెలిపారు. నివేదిక ప్రకారం.. ఉగాండా క్రోక్స్లో దాదాపు 5000 మొసళ్ళు ఉన్నాయి. ఇక్కడ వాటి సంతానాన్ని పెంచి హ్యాండ్‌బ్యాగ్ పరిశ్రమ కోసం వాడతారు.