More

  ‘యోగా’ ఎప్పుడు పుట్టింది..?

  యోగా చరిత్ర ఈనాటిది కాదు. అతి పురాతనమైన భారతీయ సంస్కృతిలో భాగంగా ఉంటూ వస్తున్న అద్భుతం. ఇక, ఆధునిక యుగంలో మొహంజదారో నాగరితక నాటి నుంచి నేటి వరకు యోగాయానం దినదిన ప్రవర్ధమానం అవుతూ వచ్చింది. క్రీస్తుపూర్వం 7000 -1300 సంవత్సరాల మధ్య.. మొహంజదారో నాణేలపైన ఒక యోగ ముద్ర కనిపిస్తుంది. ఇందులో మోకాళ్లు ఎడంగా, పాదాలు దగ్గరగా ఉంటాయి. ఈ ముద్రా సమయంలో జంతువులన్నీ చుట్టూ చేరిన దృశ్యం.. అందులో ఉన్న వ్యక్తి పశుపతిగా భావించే శివుడే అయి ఉంటాడన్నది చరిత్రకారుల అభిప్రాయం.

  రుగ్వేదం యోగాను ఒక సంయోగంగా పేర్కొంటుంది. యోగతత్వాన్ని సృష్టించింది రుగ్వేదంలో దైవశక్తిగా కీర్తించబడే హిరణ్యగర్భుడేనని కొందరి భావన. యోగాను ఒక యుద్ధరథంగా కూడా విశ్లేషిస్తారు.

  మహాభారతంలోని భగవద్గీతలో కృష్ణుడు పరమాత్మ సంబంధిత విషయాల గురించి చెబుతూ ఓ వంద సార్లయినా యోగా అనే పదాన్ని ఉపయోగిస్తాడు. దీనినిబట్టి మహాభారతం ఆ కాలంలోనూ యోగాభ్యాసం ఉన్నట్టు తెలుస్తోంది.

  మనో నియంత్రణకు సాధనంగా కఠోపనిషత్తు తొలిసారి యోగా అనే మాటను ఉపయోగిస్తుంది. యోగా ఆత్మను, పరమాత్మతో సంలీనం చేస్తుందని చెబుతుంది. ప్రాణశక్తి గురించి ఉపనిషత్తులు కూడా ప్రస్థావించాయి.

  పతంజలి యోగసూత్ర అనే గ్రంథం.. యోగ జ్ఞానానికి పెద్ద నిధి లాంటిది. మరీ ప్రత్యేకంగా ఏమీ చెప్పదు కానీ ఎనిమిది విధానాలుగా చెబుతుంది. ఆసనాలతో సహా చేసే అష్టాంగ యోగ పతంజలి యోగాలో భాగమే. పరమసత్యం అనుభవంలోకి రావడానికి ఇదొక మార్గం.

  యోగాసనాలను, ప్రాణాయామాన్నీ, మంత్రాన్ని కలిపేసుకుని తంత్రం విస్తరించింది. మహిళా దేవతల్ని, మానవ లైంగికత్వాన్నీ పూజించేందుకు ఈ తంత్రాన్ని ఉపయోగించారు. ఈ క్రియలతో దేహం దేవాలయంగా మారుతుందనేది ఒక భావన.

  బృహదారణ్యక ఉపనిషత్తు ద్వారా ప్రసిద్ధులైన యజ్ఞవల్క్యుడు అష్టాంగయోగ గురించి విపులీకరిస్తాడు. తన భార్య గార్గీకి తనకూ మధ్య జరిగిన సంభాషణల రూపంలో ఈ వివరాలు ఉంటాయి. ఇవన్నీ ఉపసంహారం, ఇమిడిపోవడం, జాగృతి, శ్వాస వంటి నైపుణ్యాల ఆధారంగా చెబుతాడు.

  యోగ అనే మాట తొలి బౌద్ధ గ్రంథాల్లో ఎక్కడా లేదు. కానీ ధ్యానం, ప్రాణాయామం, మంత్రం వంటి అంశాల చర్చ మాత్రం ఉంది. బుద్ధుని దృష్టిలో యోగ సాధన, ఒక పరిపూర్ణ మేధస్సుకు మార్గమవుతుంది.

  హైందవ సాధువు గోరక్ నాథ్ తంత్రానికి సంబంధించిన రెండు గ్రంథాలు వెలువడ్డాయి. అందులో ఒకటి 15వ శతాబ్దంలో వచ్చిన ‘హఠయోగ ప్రదీపిక’, రెండవది 17వ శతాబ్డంలో వచ్చిన ‘ఘేరంద సంహిత’. ఈ రెండూ గురు శిష్య సంవిధానాన్ని చెబుతాయి.

  యోగా తత్వం మీద కోల్ కతా రచయితలైన డాక్టర్ ఎన్.సి.పాల్ రాసిన గ్రంథం, యోగా మీద వచ్చిన తొలి శాస్త్రీయ అధ్యయనంగా గుర్తింపు పొందింది.

  స్వామి వివేకానంద పాశ్చాత్య దేశాలకు యోగాను పరిచయం చేసిన తొలి వ్యక్తి. అమెరికాలోని చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో రాజయోగ గురించిన ప్రసంగమే చేశారు.

  పరమహంస యోగానంద క్రియా యోగ మీద ఎన్నో ప్రసంగాలు చేశారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో స్వీయ జ్ఞానోదయం అనే వ్యవస్థను స్థాపించారు కూడా.

  స్వామి విష్ణుదేవానంద హఠయోగలోని శివానంద యోగాను బాగా ప్రచారంలోకి తెచ్చారు. ఇందులో 12 ఆసనాలు ఉంటాయి. వీటి లక్ష్యం వెన్నెముకలో మృదుత్వాన్ని పెంచడమే.

  మహర్షి మహేశ్ యోగి ఆయన నెలకొల్పిన అతీత ధ్యానం ఎన్నో అద్భుత ఫలితాలనిచ్చింది. ఈయన వివేకానంద జ్ఞానమార్గాన్ని, హరేకృష్ణ మహా మంత్రాన్ని, భగవద్గీత అంశాల్ని కూడా యోగాలో భాగం చేశారు.

  యోగా గురువు బిక్రం చౌదరి తన తొలి యోగా కాలేజ్ ను అమెరికాలో స్థాపించారు. అధిక ఉష్ణోగ్రత కలిగిన గదిలో వేసే 26 ఆసనాలు ఆయన సొంతంగా రూపొందించినవి. ‘హాట్ యోగా’గా పిలవబడే ఈ యోగా శరీరంలోని మాలిన్యాలను బయటికి పంపించడంతో పాటు, శరీర బరువును తగ్గించడంలో బాగా ఉపకరిస్తుంది.

  డాక్టర్ డీన్ ఆర్నిష్ అనే వ్యక్తి తన పరిశోధనల ద్వారా కొన్ని రకాల ఔషధాలకు యోగాను కూడా జోడిస్తే.. గుండె జబ్బులను, టైప్- 2 మధుమేహాన్ని తగ్గించవచ్చని రుజువు చేశాడు.

  అమెరికాకు చెందిన వెల్నెస్ టీచర్ డాక్టర్ ఆండ్రివ్ వెల్ అనే ఒక వైద్యుడు, ప్రాణాయామం, కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ ద్వారా ఎన్నో వ్యాధులను నయం చేయవచ్చని పేర్కొన్నారు.

  ఆధునిక జీవనశైలి కారణంగా మనిషి తనపై తాను నియంత్రణ కోల్పోయాడు. అది శారీరకంగా కావచ్చు లేదా భావోద్వేగ పరంగానూ కావచ్చు. వ్యాయామం లేకపోవడంతో శరీరం రోగాల కుప్పగా మారుతోంది. ఊబకాయ సమస్య ప్రపంచం మొత్తానికి సవాల్ విసురుతోంది. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేకపోవడం వల్ల మనిషి స్థాయి దిగజారుతోంది. అంతర్ శక్తిని గుర్తించలేకపోవడంతో పోటీలో వెనుకబడిపోతున్నాడు. తనపై తాను నమ్మకం కోల్పోతున్నాడు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారమే యోగా. ఎందుకంటే యోగా చేయడం ద్వారా శరీరాన్ని, మనసును, భావోద్వేగాలను, అంతర్ శక్తిని ఏకీకృతం చేయవచ్చు. తద్వారా అత్యుత్తమ ఫలితాలను రాబట్టవచ్చు.

  యోగా చరిత్ర ప్రాచీనమైంది. సింధు నాగరికత కాలం నాటికీ యోగా ఆచరణలో ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. పూర్వం హిమాలయాల్లో తపస్సు చేసుకునే మహర్షులు శారీరక ధారుడ్యం కోసం అనేక రకాల ఆసనాలు వేసేవారు. పతంజలి వాటన్నింటినీ ఓ చోట చేర్చి యోగాకు ఓ రూపునిచ్చాడు. అందుకే పతంజలిని యోగా పితామహుడిగా అభివర్ణిస్తారు. అయితే ఆధునిక కాలంలో యోగా గురించి ప్రజలు చర్చించుకునేలా చేసినంది మాత్రమే బి.కె.ఎస్. అయ్యంగార్. ఆయన కృషి వల్ల యోగాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. యోగాపై అనేక పరిశోధనలు చేసిన అయ్యంగార్ తన అనుభవాలతో యోగా గురించి అనేక పుస్తకాలు రాశారు. ఆయన రూపొందించిన టెక్నిక్లతో కూడిన యోగాకు అయ్యంగార్ యోగా అనే పేరొచ్చింది. ప్రస్తుతం ఎంతో మంది యోగా టీచర్లు యోగా ప్రాశాస్త్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నారు. ఎన్నో నూతన పద్ధతులను కనిపెడుతూ యోగా స్థాయిని మరింత పెంచుతున్నారు.

  spot_img

  Trending Stories

  Related Stories