రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరపున పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా హైదరాబాదుకు చేరుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు. సిన్హాకు కేసీఆర్, తెలంగాణ కేబినెట్ మంత్రులు ఘన స్వాగతం పలికారు. నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ దగ్గర ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్, సిన్హా ప్రసంగించనున్నారు.
బేగంపేట విమానాశ్రయంలో యశ్వంత్ సిన్హా కు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గాడ్, ఎంపీ నామా నాగేశ్వరరావు తదితర నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరంతా ఎయిర్ పోర్ట్ నుంచి నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ కు బయల్దేరారు. కేసీఆర్, యశ్వంత్ సిన్హా ఇద్దరూ ఒకే వాహనంలో బయల్దేరారు. కాన్వాయ్ కు ముందు బైక్ ర్యాలీ కొనసాగుతోంది. వేలాది బైక్ లు ముందుకు సాగుతుండగా కేసీఆర్ కాన్వాయ్ వారిని అనుసరిస్తోంది.