More

  విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా

  విపక్షాలు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించాయి. సీనియర్ నేత మార్గరెట్ ఆల్వాను తమ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దించాయి. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం విపక్ష నేతలు ఇవాళ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో సమావేశమయ్యారు. సుదీర్ఘ చర్చల అనంతరం మార్గరెట్ ఆల్వా పేరును శరద్ పవార్ ప్రకటించారు. మార్గరెట్ ఆల్వా కర్ణాటకకు చెందిన మహిళా కాంగ్రెస్ నేత. ఆమె గతంలో గోవా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేశారు. మార్గరెట్ ఆల్వా గతంలో ఉత్తర కన్నడ లోక్ సభ స్థానం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 1984-89 మధ్య కేంద్ర సహాయమంత్రిగా పనిచేశారు.

  ఆమె నాలుగు పర్యాయాలు (1974, 1980, 1986 మరియు 1992) రాజ్యసభలో ఉన్నారు. 1999లో ఆమె ఉత్తర కన్నడ నియోజకవర్గం నుండి 13వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఆమె పలు కీలక పదవులు చేపట్టారు. ఆమె అత్తగారు వైలెట్ అల్వా 1960లలో రాజ్యసభ స్పీకర్‌గా ఉన్నారు. ఇక ఆగస్టు 6న జరిగే భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్డీయే ఇప్పటికే జగ్ దీప్ ధ‌న్‌ఖడ్ ను తమ అభ్యర్థిగా ప్రకటించడం తెలిసిందే.

  spot_img

  Trending Stories

  Related Stories