More

    ఆన్ లైన్ లో డబ్బు ట్రాన్స్ ఫర్ చేసే పరిమితిని మరింత పెంచిన ఆర్బీఐ

    రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యంగా భారత్ లో ఆన్ లైన్ లో డబ్బుల ట్రాన్ఫర్ బాగా పెరగడంతో.. పరిమితిని కూడా మరింత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ కీల‌క నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు.

    ఇమ్మిడియేట్ పేమెంట్ స‌ర్వీస్(ఐఎంపీఎస్‌) లావాదేవీ ప‌రిమితిని రూ.5 ల‌క్ష‌ల‌కు పెంచిన‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఒక ట్రాన్జాక్ష‌న్‌పై 2 ల‌క్ష‌ల ప‌రిమితి ఉంది. ఇప్పుడు ఏకంగా 5 లక్షల రూపాయలు అయింది. ఐఎంపీఎస్ వ్య‌వ‌స్థ‌కు చాలా ప్రాముఖ్య‌త పెరిగింద‌ని.. అందుకే ఐఎంపీఎస్ లిమిట్‌ను 2 ల‌క్ష‌ల నుంచి 5 ల‌క్ష‌ల‌కు పెంచేందుకు ప్ర‌తిపాద‌న చేసిన‌ట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ తెలిపారు. కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథ స్థితిని కొనసాగించింది. వరుసగా ఎనిమిదో సారి వడ్డీరేట్లను మార్చలేదు. రెపోరేటును 4 శాతం, రివర్స్ రెపో రేటును 3.35 శాతం వద్దే ఉంచింది. దేశవ్యాప్తంగా ఆఫ్ లైన్ విధానంలో రిటైల్ డిజిటల్ పేమెంట్స్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిఫార్సులు చేసింది.

    ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇవాళ ప్రకటించారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నా, ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం కోసమే వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని ఆయన తెలిపారు. పాయింట్ ఆఫ్ సేల్స్‌(పీఓఎస్‌), క్విక్ రెస్పాన్స్‌(క్యూఆర్) కోడ్ల వ‌ల్ల లావాదేవీల‌ను పెంచేందుకు కూడా ఆర్బీఐ ఓ నిర్ణ‌యం తీసుకున్న‌ది. పీఏ స‌దుపాయాలు లేని ప్రాంతాలను టార్గెట్ చేసి, అక్క‌డ జియో ట్యాగింగ్ టెక్నాల‌జీని పెంపొందించ‌నున్న‌ట్లు శ‌క్తికాంత్ దాస్ తెలిపారు. ఇక వ‌డ్డీ రేట్ల‌ను య‌ధాత‌థం ఉంచారు. వ‌రుస‌గా ఎనిమిదోసారి కూడా ఆర్బీఐ వ‌డ్డీ రేట్ల‌ను మార్చ‌లేదు. రెపో రేటు 4 శాతంగా, రివ‌ర్స్ రెపో రేటు 3.35 శాతం ఉన్న‌ట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం రిటైల్ ద్రవ్యోల్బణం 5.7 శాతం నుంచి 5.3 శాతానికి సవరణ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జులై–సెప్టెంబర్ మధ్య అంచనాల కన్నా తక్కువగా నమోదు అయింది. అక్టోబర్–డిసెంబర్ కు గానూ 5.3 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక వృద్ధి రేటు 9.5 శాతంగా ఉంటుందని అంచనా వేయగా.. 2023 తొలి త్రైమాసిక వృద్ధి రేటు 17.1 శాతం లక్ష్యంగా ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుని వెళ్లాలని భావిస్తూ ఉన్నారు.

    Related Stories