దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని చెర్‌మార్గ్ ప్రాంతంలో శనివారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. “#షోపియన్‌లోని జైనాపోరా ప్రాంతంలోని చెర్‌మార్గ్‌లో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. పోలీసులు, భద్రతా బలగాలు పనిలో ఉన్నాయి. మరిన్ని వివరాలు తెలియజేస్తాము “అని పోలీసు ప్రతినిధి తెలిపారు. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన కొద్దిసేపటికే ఎన్‌కౌంటర్ మొదలైంది.
ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ తీవ్రవాది హతమయ్యాడు. షోపియాన్‌లోని చెర్‌మార్గ్, జైన్‌పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో గాలింపు బృందాలపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. అతడు ఏ గ్రూప్‌నకు చెందినవాడనే విషయం ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు. ఇంకా అక్కడ ఎంత మంది ఉగ్రవాదులు దాక్కున్నారనే విషయం తెలియరాలేదు. ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.