ఇళ్లు కోల్పోయిన వారికి సాయం ప్రకటించిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్

0
679

గుంటూరు జిల్లా ఇప్పటంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇళ్లు కోల్పోయిన వారికి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ తన వంతు సాయం ప్రకటించారు. ఇప్పటం వెళ్లి స్వయంగా బాధితులను పరామర్శించిన పవన్ కళ్యాణ్ వారికి రూ. లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ విషయాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మీడియాకు తెలియజేశారు. ఇప్పటం గ్రామంలో వైసీపీ ప్రభుత్వందాష్టీకానికి ఇళ్లు దెబ్బతిన్న వారు, నివాసాలు కోల్పో్యిన వారికి రూ. లక్ష వంతున అందించి అండగా నిలబడాలని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ నిర్ణయించారు. మార్చి14న ఇప్పటం శివారులో జరిగిన జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం వాసులు సహకరించారని, సభా స్థలిని ఇచ్చారని వైసీపీ ప్రభుత్వం కక్షగట్టి ఇళ్లను కూల్చిందని ఆరోపించారు నాదెండ్ల మనోహర్‌. ఇళ్లు దెబ్బతిన్నా ధైర్యం కోల్పోని ఇప్పటంవాసుల గుండె నిబ్బరాన్ని చూసి పవన్ కళ్యాణ్ చలించిపోయారు. బాధితులకు జనసేన అండగా ఉంటుందని ప్రకటించారు. వారికి నైతిక మద్దతుతో పాటు ఆర్థికంగా కూడా అండగా నిలబడాలని లక్ష రూపాయల వంతున భరోసాను ప్రకటించారని నాదెండ్ల మనోహర్ తెలిపారు.