ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు

0
875

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. దక్షిణాఫ్రికాలో మొదట వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ క్రమంగా వివిధ దేశాలకు వ్యాపిస్తోంది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ వేరియంట్ తొలికేసు నమోదయ్యింది. రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఒమిక్రాన్ తొలి కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఐర్లాండ్ నుంచి వ్యక్తికి ఒమిక్రాన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.

దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.. సోమవారం నాడు సీఎం జగన్ వైద్య ఆరోగ్య శాఖ పై సమీక్షనిర్వహించనున్నారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగే సమీక్షకు హాజరుకానున్న మంత్రి ఆళ్ళ నాని, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో సీఎం నాడు-నేడు పనులు, కొత్తగా ఏర్పాటు చేయబోతున్న మెడికల్ కాలేజీల పనులు పురోగతి పై సమీక్షించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కేరళ రాష్ట్రంలోనూ తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. బ్రిటన్ నుంచి కొచ్చి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆ వ్యక్తి ఈ నెల 6న బ్రిటన్ నుంచి కొచ్చి వచ్చినట్టు గుర్తించామని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. కేరళకు చెందినవాడేనని తెలిపారు. దేశంలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో కేరళ ఉంది. ఇప్పుడు ఒమిక్రాన్ టెన్షన్ అక్కడ మొదలైంది.