More

    అధికారిక నిర్ధారణ.. దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం

    భారతదేశంలో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు చెందిన 74 ఏళ్ల వృద్ధుడు ఒమిక్రాన్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. జ్వరం, దగ్గు రావడంతో ఉదయ్ పూర్ లోని మహారాణా భూపాల్ ప్రభుత్వ ఆసుపత్రిలో డిసెంబర్ 15న చేర్పించారు. డిసెంబర్ 21, 25 తేదీల్లో రెండు సార్లు నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో ఆయనకు నెగటివ్ అని తేలింది. డిసెంబర్ 31న ఆయన కన్నుమూశారు. మృతుడు పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నాడని వైద్యులు తెలిపారు. ఆయనకు ఇతర ఆనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని చెప్పారు. ఆయన మృతిని కేంద్ర ఆరోగ్యశాఖ ఒమిక్రాన్ మరణంగా అధికారికంగా ప్రకటించింది. సాంకేతికంగా ఇది ఒమిక్రాన్ సంబంధిత మరణమని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. మృతుడికి మధుమేహంతో పాటు, ఇతర సమస్యలు కూడా ఉన్నాయని చెప్పారు. ఒమిక్రాన్ పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే ప్రొటోకాల్ ప్రకారం చికిత్స అందిస్తూనే, ఇతర అనారోగ్య సమస్యలకు కూడా వైద్యం అందించారు. ఒమిక్రాన్ టెస్టుకు ముందే చనిపోయిన వ్యక్తి జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడ్డారని ఉదయ్ పూర్ చీఫ్ మెడికల్, హెల్త్ ఆఫీసర్ దినేశ్ తెలిపారు. ఒమిక్రాన్ సోకిందంటూ డిసెంబర్ 25న జీనోమ్ సీక్వెన్సింగ్ రిపోర్టు వచ్చిందని తెలిపారు. అయినప్పటికీ జాగ్రత్త చర్యల్లో భాగంగా డిసెంబర్ 25నే మరోసారి కోవిడ్ టెస్ట్ చేయించగా నెగెటివ్ వచ్చింది. అప్పటి నుండి ఆయనకు ఐసీయూలోనే ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆరోగ్యం విషమిస్తూ వచ్చిందని… డిసెంబర్ 31న మృతి చెందారని వెల్లడించారు. మృతుడు మధుమేహం, హైపో థైరాయిడ్, హైపర్ సెన్సిటివ్ వంటి లక్షణాలు కలిగి ఉన్నారని చెప్పారు. మృతుడికి గతంలో కరోనా రాలేదట. ఈ మరణం ఒమిక్రాన్ కారణంగానే సంభవించిందని వైద్య ఆరోగ్య శాఖ ధృవీకరించింది.

    హోం ఐసోలేషన్‌కు సంబంధించి సవరించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కరోనా సోకినవారు ఇకపై పది రోజులపాటు హోం ఐసోలేషన్ ఉండాల్సిన పనిలేదని.. కొవిడ్ సోకినట్టు నిర్ధారణ అయిన తర్వాత ఏడు రోజులు హోం ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుందని ప్రభుత్వం తెలిపింది. ఏడు రోజుల్లో వరుసగా మూడు రోజులపాటు జ్వరం రాకుంటేనే ఇది వర్తిస్తుందని తెలిపింది. ఐసోలేషన్ ముగిసిన తర్వాత మళ్లీ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది. మాస్క్ ధరించడం మాత్రం తప్పనిసరి అని పేర్కొంది. కరోనా రోగులకు దగ్గరగా ఉన్న లక్షణాలు లేనివారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిన అసవరం లేదని, వారు హోం క్వారంటైన్‌లో ఉండి ఆరోగ్యాన్ని గమనిస్తూ ఉంటే సరిపోతుందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కొత్త మార్గదర్శకాల్లో పేర్కొంది. వరుసగా మూడు రోజులపాటు 100 డిగ్రీలకు మించి జ్వరం ఉన్నా, గంటలోపు ఆక్సిజన్ స్థాయి 93 శాతం కంటే కిందికి పడిపోయినా, చాతీలో నొప్పి, ఒత్తిడి ఉన్నా, శ్వాసరేటు పడిపోయినా, అలసటగా ఉన్నా వెంటనే వైద్యసాయం తీసుకోవాలని సూచించింది.

    Trending Stories

    Related Stories