కెజియఫ్ తాతయ్య ప్రధాన పాత్రలో ‘ఒక Sextant కథ’

0
795
కెజియఫ్ తాతయ్య ప్రధాన పాత్రలో 'ఒక Sextant కథ' ట్రైలర్ విడుదల
కెజియఫ్ తాతయ్య ప్రధాన పాత్రలో 'ఒక Sextant కథ' ట్రైలర్ విడుదల

కెజియఫ్ తాతయ్య కృష్ణోజీ రావు ప్రధాన పాత్రలో కేసరి ఫిలిం కాప్చర్ బ్యానర్ పై కుమార్ ఎల్ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘ఒక Sextant కథ’. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో ‘ఒక Sextant కథ’ కథా నేపధ్యాన్ని చూపించారు.
సినీ జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన నారాయణ అలియాస్ నానో నారాయణ “కేజీఎఫ్” సినిమా తర్వాత చాలా పాపులర్ అవుతాడు. అతని భార్యకు అరుదైన వ్యాధి బారిన పడుతుంది. భార్యకి వచ్చిన వ్యాధిని నయం కావాలంటే 20 లక్షలు కావాలి. అతని దగ్గర “విక్టోరియన్ సెక్స్టాంట్ బైనాక్యులర్” అనే యాంటిక్ వస్తువు వుంటుంది. దీని ద్వారా చూస్తే మనుషులు “నగ్నంగా” కనిపిస్తారు. దినీని అమ్మి డబ్బు సంపాదించి అతని భార్యను ఎలా రక్షించడానేది కథాంశం.
ట్రైలర్ లో కామెడీ, లవ్ , డ్రామా, ఎమోషన్ అన్ని ఎమోషన్స్ వున్నాయి. సినిమాలో మంచి కంటెంట్ వుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది. ట్రైలర్ లో కృష్ణోజీ రావు నటన చాలా సహజంగా ఆకట్టుకుంది. శివ శంకర్ కెమరాపనితనం ఆకట్టుకుంది. అరవ్ రిషిక్ నేపధ్య సంగీతం డీసెంట్ గా వుంది. త్వరలోనే సినిమా విడుదల తేదిని ప్రకటించనున్నారు మేకర్స్.
నటీనటులు: కృష్ణోజీ రావు, ప్రశాంత్ సిద్ది, అపూర్వ, అనంతు పద్మనాభ, శ్యలేష్ , కింగ్ మోహన్ తదితరులు
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం : కుమార్
బ్యానర్ : కేసరి ఫిలిం క్యాప్చర్
సంగీతం : అరవ్ రిశిక్
డివోపీ : రాజా శివ శంకర్
ఎడిటర్ : సిద్దు

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

4 × 1 =