More

    పై అధికారులకు ఫిర్యాదు చేసాడనే విషయాన్ని మనసులో పెట్టుకుని

    ఘజియాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆఫీసులో గొడవ కారణంగా తన సహోద్యోగిని చంపి, తలను నరికినందుకు వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఆదివారం జరగ్గా, ఒకరోజు తర్వాత నిందితుడిని అరెస్ట్ చేశారు. మృతుడు 37 ఏళ్ల ప్రమోద్ కుమార్‌గా గుర్తించబడ్డాడు. అతను ఆటోమొబైల్ అనుబంధ కంపెనీలో మెషిన్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. ఘజియాబాద్‌లోని లాల్ కువాన్ ప్రాంతంలో నిందితుడు సందీప్ మిశ్రా ఇంట్లో మొండెం భాగం, తల చెత్త కుండీలో కనిపించాయి. ఆదివారం ప్రమోద్‌ను మద్యం తాగేందుకు సందీప్ తన ఇంటికి పిలిపించాడని పోలీసులు తెలుసుకున్నారు. ప్రమోద్‌ మద్యం తాగడానికి వచ్చిన సందీప్‌ గొంతు నులిమి హత్య చేశాడు. “రాత్రంతా, నిందితుడు మృతదేహంతో గదిలోనే ఉన్నాడు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో, అతను ప్రమోద్ తలను నరికి గోనె సంచిలో ఉంచాడు, దానిని అతను డస్ట్ బిన్ లో విసిరాడు,” అని కవి నగర్ పోలీస్ స్టేషన్ SHO ఆనంద్ ప్రకాష్ మిశ్రా తెలిపారు.

    సందీప్ మిశ్రా కంపెనీలో మెషీన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో ప్రమోద్ కుమార్ సీనియర్‌ ఉద్యోగిగా ఉన్నాడు. ఈ క్రమంలో సందీప్ పనితీరుపై ప్రమోద్ కుమార్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. తనపై ఫిర్యాదు చేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన సందీప్ మిశ్రా ప్రమోద్ కుమార్‌పై కక్ష పెంచుకున్నాడు. ఆదివారం రాత్రి పార్టీకి ఆహ్వానించి మద్యం తాగించాడు. సందీప్ మత్తులోకి జారుకున్న వెంటనే కత్తితో అతడి తలను నరికాడు. అనంతరం అక్కడే నిద్రపోయాడు. ఉదయం లేచి తలను ప్లాస్టిక్ సంచిలో చుట్టి బయటకు తీసుకొచ్చి చెత్తకుప్పలో విసిరేశాడు. సందీప్ భార్య మీరాదేవి భర్తకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో వెతుక్కుంటూ సందీప్ ఇంటికి వచ్చింది. ఇంటి బయట రక్తపు మరకలు ఉండడంతో అనుమానించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తలుపు బద్దలుగొట్టి చూడగా లోపల ప్రదీప్ తలలేని మృతదేహం కనిపించింది. ఆ తర్వాత అక్కడికి 500 మీటర్ల దూరంలోని చెత్తకుప్ప నుంచి తలను స్వాధీనం చేసుకున్నారు. సందీప్‌ను పట్టుకుని పోలీసులు విచారిస్తూ ఉన్నారు.

    Trending Stories

    Related Stories