ఒడిశా ఆరోగ్య మంత్రి నబా కిసోర్ దాస్‌పై ఆదివారం ఝార్సుగూడ జిల్లాలోని బ్రజరాజ్‌నగర్ సమీపంలోని గాంధీచౌక్ సమీపంలో అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ కాల్పులు జరిపారు. ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతుండగా అతడిపై కాల్పులు జరపడంతో ఛాతీలోకి బుల్లెట్లు దూసుకువెళ్లాయి. పోలీసు అధికారి రెండు రౌండ్లు కాల్చడంతో మంత్రికి తీవ్రగాయాలయ్యాయి, ఆయనను ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మంత్రిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. జార్సుగూడ జిల్లాలో బ్రజ్ రాజ్ నగర్ పట్టణంలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన మంత్రి కారు దిగుతున్న సమయంలో సమీపం నుంచి అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ ఐదారు రౌండ్ల కాల్పులు జరిపాడు. నిందితుడిని ఏఎస్ఐ గోపాల్ దాస్ గా గుర్తించారు.
ఆ తర్వాత విమానంలో భువనేశ్వర్‌కు తరలించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. “అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ASI) గోపాల్ దాస్ మంత్రిపై కాల్పులు జరిపారు. మంత్రి గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించాము” అని బ్రజ్‌రాజ్‌నగర్ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గుప్తేశ్వర్ భోయ్ మీడియాకు తెలిపారు. నిందితుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మంత్రి నబా కిసోర్ దాస్ వాహనంలోంచి దిగగానే కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాడి వెనుక కారణాలు స్పష్టంగా తెలియరాలేదు.